వైరల్ వీడియో: వారెన్ బఫెట్ కోసం చెఫ్ గా మారిన బిల్ గేట్స్...!

బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ కుబేరు లలో ఆయన ఒక్కరు.

 Bill Gates Makes Oreo Cake For Warren Buffet 90th Birthday, Warren Buffet, Bill-TeluguStop.com

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు. ఎంత గొప్పవారు అయినా మనసుకు నచ్చిన వాళ్ళ కోసం ఎప్పడు స్పెషల్ గా ఎదోఒక్కటి ఇవ్వాలని లేదా.

స్పెషల్‌ గా విషెస్ చెప్పాలని అనుకుంటారు.వారి కోసం స్వయంగా మన చేతులతో తయారు చేసింది ఇస్తే.

ఇంకేంత ఆనందంగా ఉంటుంది.ఇలాంటి ఆనందాలను సామాన్యుల నుండి ఉన్నత స్థాయి వాళ్లు కూడా ఆస్వాదిస్తారు.

ఇకపోతే ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త బిల్ ‌గేట్స్ తన స్నేహితుడు వారెన్ బఫెట్ 90వ పుట్టినరోజు కోసం స్వయంగా ఓరియో కేక్ తయారు చేశారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అయితే బిల్ గేట్స్ పోస్టు చేసిన వీడియో చూస్తే బిల్‌గేట్స్ ఎంతో అనుభవం ఉన్న చెఫ్‌ గా కేక్ ని తయారు చేశాడు.ఇక ఆ కేక్ పై 90 వ పుట్టినరోజు శుభాకాంక్షలు వారెన్ అంటూ రాశారు.

అంతేకాకుండా ఆ వీడియోలో బిల్ ‌గేట్స్ ఆప్రాన్ ధరించి కిచెన్‌ లోకి ప్రవేశించారు.

ఆ తదుపరి పిండిని జల్లడ పట్టాడు.ఇక చాక్లెట్ బార్ కత్తిరించడం వరకు అతను ప్రతిదీ చేశారు.చివరికి కేక్ ఎంతో కలర్ ‌ఫుల్ ‌గా సరైనా ఆకారానికి తీసుకువచ్చారు.

ఇక ఆ కేక్ రెడీ తయారీ అయిపోయాక, కేక్‌ ను పట్టుకొని కెమెరాకు ఫోజిలిచ్చి అనంతరం కేక్ పీస్‌ ను కట్ చేశారు ఆయన.ఇక వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తొలిసారిగా 1991లో కలుసుకున్నారు.అప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది.ఈ సెలెబ్రేషన్స్ లో వారెన్ బఫెట్ 90ఏళ్ళు ఉన్న 30 ఏళ్ల కుర్రడిలా మారిపోయాడని బిల్ గేట్స్ అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube