తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చిన బిల్‎గేట్స్..!

కరోనా వైరస్‎ను సృష్టించి దానిని ప్రపంచ దేశాల మీదకు వదిలారనే కుట్ర సిద్ధాంతాలను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‎గేట్స్ తిప్పికొట్టారు.ఆ వైరస్‎కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని బిల్‎గేట్స్ స్పష్టం చేశారు.

 Billgates, Microsoft, Corona Virus, Corona Vaccine,who,bill Gates Denies Conspir-TeluguStop.com

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఎంతగానో డబ్బును ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.అయినప్పటికీ తనపై ఇలాంటి దుష్ర్ఫచారం జరుగుతుందో అర్ధం కావడం లేదని వాపోయారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని కోరారు.

కరోనా వైరస్‎ను అడ్డుకునేందుకు త్వరగా టీకాలు రావాలని బిల్‎గేట్స్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

ఈ విషయంలో అన్ని దేశాలు వరల్డ్ హెల్త్ఆర్గనైజేషన్ కు సహకరించాలని సూచించారు.ఎలాంటి వైరస్ నైనా ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్‎ను సిద్ధం ఉండాలని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు పలు అర్ధాలు తీసి తనపై ఆరోపణలు వేస్తున్నారని బిల్‎గేట్స్ అన్నారు.

ఈ వ్యాఖ్యల ఆధారంగా కరోనా వైరస్ పుట్టుకకు బిల్‎గేట్స్ కారణమంటూ సోషల్ మీడీయాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.ఈ వీడియోను యూట్యూబ్ లో కోట్ల సంఖ్యలో వీక్షించారు.

ప్రపంచంలో 15 శాతం జనాభాను చంపేయాలన్నదే బిల్‎గేట్స్ లక్ష్యమని వీడియోలో ఉంది.

తనపై జరుగుతున్న కుట్ర సిద్ధాంతాలపై బిల్‎గేట్స్ స్పందించారు.

కరోనా మహమ్మారి, సోషల్ మీడియాలది ఓ దుష్ట కలయిక అన్నారు బిల్‎గేట్స్.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని, ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నామని చెప్పుకొచ్చారు.

కరోనాపై పోరాడేందుకు ఇప్పటికే 250 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించిన బిల్‎గేట్స్.గత 20 ఏళ్లలో అనేక దేశాల్లో వైద్య సదుపాయాల అభివృద్ధికి వందల కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ప్రజలను టీకాలతో చంపేసి డబ్బు సంపాదించాలనుకునే నీచమైన మనస్తత్వం తమది కాదని బిల్‎గేట్స్ స్పష్టం చేశారు.తమకు వ్యాక్సిన్లతో అనుబంధం ఉన్న మాట నిజమే కానీ మీరు అనుకుంటున్నట్లు కాదని తెలిపారు.నిజానిజాలేమిటో అర్ధం చేసుకుంటారన్న నమ్మకం తనకుందని బిల్‎గేట్స్ వివరణ ఇచ్చారు.2015లో జికా వైరస్ బయట పడినప్పుడూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని బిల్‎గేట్స్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube