అంగరంగ వైభవంగా బిల్ గేట్స్ కుమార్తె పెళ్లి..ఎంత ఖర్చు చేసారంటే?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు కుబేరుడుగా పేరు తెచ్చుకున్న బిల్ గేట్స్ ఇంట్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.బిలీనియర్ బిల్ గేట్స్ అతడి మాజీ భార్య మిలిందా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

 Bill Gates Daughter Wedding With Nayel Nassar Details, Bill Gates, Nayel Nassar,-TeluguStop.com

జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ వివాహం ఆమె ప్రియుడు నాయెల్ నాజర్ తో అంగరంగ వైభవంగా జరిగిపించారు.

ఈ పెళ్లి గత ఏడాదిలోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.

జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ గత ఏడాది జనవరిలోనే సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్త ఫోటోలను షేర్ చేసింది.అయితే అప్పటి నుండి కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండడం వల్ల ఈమె పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గు ముఖం పట్టడంతో వీరి పెళ్లి జరిగింది.

అక్టోబర్ 17న వీరి పెళ్లిని ఘనంగా జరిపించాడు బిల్ గేట్స్.

ఈ పెళ్లిని బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దగ్గరుండి జరిపించారు.జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, నాయెల్ నాజర్ కలిసి స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువు కున్నారు.

ఇక అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమించు కున్నారు.వీరి ప్రేమ వివాహానికి ఇరువురు పెద్దలు అంగీకరించడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Telugu Dollars, Gates, Corona, Covid, Jennifer Gates, Microsoft, Nayel Nassar, N

వీరి వివాహం 142 ఎకరాల ఎస్టేట్ లో జరిగింది.అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్ళికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాలని అనుకున్నారు.అయితే ఎంత సన్నిహితులను పిలిచినా లిస్ట్ లో 300 మంది అయ్యారట.అయితే వారికీ కూడా టీకా సర్టిఫికేట్ తో పాటు నెగిటివ్ రిపోర్ట్ తీసుకు రావాలని తెలిపారట.

ఈ కరోనా నేపథ్యంలోనే బిల్ గేట్స్ కుమార్తె పెళ్లి తక్కువ ఖర్చుతో జరిగిందట.

Telugu Dollars, Gates, Corona, Covid, Jennifer Gates, Microsoft, Nayel Nassar, N

ఈ పెళ్ళికి కేవలం 2 మిలియన్ డాలర్లు అంటే 14 కోట్లు మాత్రమే ఖర్చు చేశారట.14 కోట్లు అంటే మామూలు జనాలకు ఎక్కువ కానీ బిల్ గేట్స్ వంటి సంపన్నులకు అది పెద్ద విషయం కాదు.అదే కరోనా లేకుండా ఉండుంటే వందల కోట్లు ఖర్చు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube