ఆయన బాగానే వున్నారు.. త్వరలోనే డిశ్చార్జ్: బిల్‌క్లింటన్ ఆరోగ్యంపై జో బైడెన్ ప్రకటన

Bill Clinton Doing Fine And Will Be Out Of Hospital Soon Us President Joe Biden

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ కోలుకుంటున్నారని.త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీడియాకు తెలిపారు.

 Bill Clinton Doing Fine And Will Be Out Of Hospital Soon Us President Joe Biden-TeluguStop.com

కనెక్టికట్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ.క్లింటన్‌తో మాట్లాడానని.

ఆయన బాగున్నారని, రేపోమాపో డిశ్చార్జ్ అవుతారని బైడెన్ చెప్పారు.

 Bill Clinton Doing Fine And Will Be Out Of Hospital Soon Us President Joe Biden-ఆయన బాగానే వున్నారు.. త్వరలోనే డిశ్చార్జ్: బిల్‌క్లింటన్ ఆరోగ్యంపై జో బైడెన్ ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ లాస్ ఏంజిల్స్‌కు ఆగ్నేయంగా వున్న ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో తన భర్త పక్కనే వున్నారు.

అలాగే క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ శనివారం తల్లి హిల్లరీతో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రత మధ్య ఆసుపత్రికి చేరుకుంటున్న దృశ్యాలను అమెరికన్ మీడియా ప్రసారం చేసింది.తాను ఆసుపత్రిలో చేరినట్లు మీడియా ప్రసారం చేస్తున్న కథనాలను చూస్తూ.

పుస్తకాలు చదువుతూ క్లింటన్ గడుపుతున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు ఏంజెల్ ఉరేనా విలేకరులకు చెప్పారు.క్లింటన్ ఐసీయూలో వున్నప్పటికీ ఐసీయూ కేర్ అందుకోవడం లేదని తెలిపారు.

కాగా, మంగ‌ళ‌వారం ఓ వ్యక్తిగత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బిల్‌ క్లింట‌న్.తనకు స్వ‌ల్ప అనారోగ్యంగా వుందని త‌న సిబ్బందికి తెలిపారు.దీంతో వారు ఆయనను కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే.ప్ర‌స్తుతం క్లింట‌న్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఇర్విన్ వైద్య వర్గాలు తెలియజేశాయి.

యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్లే క్లింట‌న్ అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఇది వ‌య‌సు పైబ‌డిన వారిలో సాధారణంగా వ‌చ్చే స‌మ‌స్యే అని వైద్యులు స్ప‌ష్టం చేశారు.డాక్ట‌ర్ అల్పేస్ అమీన్, డాక్ట‌ర్ లిసా బార్‌డాక్ నేతృత్వంలో క్లింట‌న్‌కు చికిత్స కొన‌సాగుతోంది.క్లింట‌న్‌కు 2004లో బైపాస్ హార్ట్ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు.2010లో రెండు స్టెంట్లు కూడా వేశారు.కానీ ఆయ‌న‌కు ఎలాంటి గుండె స‌మ‌స్య కానీ, కొవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ కానీ లేద‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు.1993 నుంచి 2001 మ‌ధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింట‌న్ సేవ‌లందించారు.

బిల్‌‌క్లింటన్ ప్రస్థానం:

క్లింటన్ పూర్తి పేరు విలియం జెఫెర్సన్ బ్లైత్ III .1946 ఆగస్టు 19న అర్కాన్సాస్‌లోని హోప్‌లో వున్న జూలియా జెస్టర్ హాస్పిటల్‌లో ఆయన జన్మించారు.ఆయన జననానికి మూడు నెలల ముందు క్లింటన్ తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.స్కాలర్‌షిప్‌ల సాయంతో విద్యాభ్యాసం చేసిన క్లింటన్.జార్జియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు.1964-65 మధ్యకాలంలో క్లాస్ ప్రెసిడెంట్‌గా ఆయన గెలుపొందారు.అనంతరం ఆర్కాన్సస్ సెనేటర్ జే విలియమ్ ఫుల్‌బ్రైట్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు.అనంతరం డెమొక్రాటిక్ పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన రాజకీయాలలో ప్రవేశించారు.ఈ నేపథ్యంలోనే క్లింటన్ 1978లో ఆర్కాన్సస్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.తిరిగి 1983లో గవర్నర్‌గా ఎన్నికైన ఆయన 1992 వరకు ఆ పదవిలో కొనసాగారు.1993 నుంచి 1997 వరకు తొలిసారి అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించారు.అనంతరం 1997లో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

#Joe Biden #Joe Biden #Bill Clinton #Bill Clinton #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube