ఇక్కడి వినాయకుడి చెవులో కోరికలు చెప్పితే నెరవేరుతాయి... ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసా?  

Bikkavolu Vinayaka Temple-

ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. విఘ్నలను తొలగించి పనులు సక్రమంగా అయ్యేలా చూసే మరియు తోలి పూజ అందుకొనే వినాయకుణ్ణి ప్రతి రోజు పూజిస్తే మనకు మంచి జరుగుతుంది. ప్రతి రోజు దేవతలు కూడా వినాయకుణ్ణి ఆరాదిస్తారంటే ఎంతటి శక్తివంతమైన దేవుడో అర్ధం అవుతుంది. నిత్యం భక్తుల కోరికలను తీర్చే వినాయకుడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో ఉన్నారు. ఇక్కడ వెలసిన వినాయకునికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు.

క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది చాల పురాతన ఆలయం అని అర్ధం అవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చెప్పినట్టు ఒక కధ వినిపిస్తుంది. అప్పుడు ఈ విషయాన్ని ఆ భక్తుడు గ్రామస్తులకు చెప్పటంతో వెలుగులోకి వచ్చింది. వినాయక విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది.

వినాయకుని చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి వినాయకుణ్ణి దర్శించుకొని వెళుతూ ఉంటారు. ఇక్కడ గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ గణపతి హోమం చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు.