కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై దారుణం..రెప్పపాటులో ఘోరం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది.భరత్ పూర్‌కు చెందిన డాక్టర్ దంపతులను బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.

 Bikers Shoot And Killed Doctor Couple In Car In Rajasthan-TeluguStop.com

ఈ దారుణ ఘటన శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య జరిగింది.డాక్టర్ దంపతులు కారులో వెళ్తుండగా దుండగులు వారి కారును ఓవర్ టేక్ చేసి బైక్ అడ్డుపెట్టారు.

ఆ తర్వాత కారు డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా కాల్పులు జరపడంతో డాక్టర్ దంపతులు స్పాట్‌లోనే చనిపోయారు.అనంతరం నిందితులు బైక్ మీద పారిపోతూ గాలిలోకి కూడా కాల్పులు జరిపారు.

 Bikers Shoot And Killed Doctor Couple In Car In Rajasthan-కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై దారుణం..రెప్పపాటులో ఘోరం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డాక్టర్ దంపతులు 2019లో జరిగిన ఓ యువతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.రాజస్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌ బిజీ క్రాసింగ్ వ‌ద్ద జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.శుక్రవారం సాయంత్రం 4.45 నిమిషాల‌కు ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.బిజీ క్రాసింగ్ వ‌ద్ద బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు కారుకు అడ్డంగా నిలబడి ఆపారు.

అయితే డ్రైవ‌ర్ సీటులో ఉన్న డాక్ట‌ర్‌ కారు విండో తీస్తుండ‌గానే బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న చేతిలో ఉన్న తుపాకీతో కాల్పులు జ‌రిపాడు.

ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిపి డాక్టర్ సందీప్ గుప్తా, ఆయన భార్య సీమా గుప్తా మరణించిన అనంతరం బైక్‌పై ప‌రారీ అయ్యారు.

ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.ప్ర‌తీకారంతోనే డాక్ట‌ర్ దంపతుల‌ను హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.చనిపోయిన యువతి డాక్ట‌ర్‌తో రిలేష‌న్‌పిప్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా డాక్ట‌ర్‌పై కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ఆ యువ‌తి సోద‌రుడిలా ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.రెండేళ్ల క్రితం ఆ యువ‌తి హ‌త్య‌కు గురైంది.

ఈ కేసులో డాక్ట‌ర్ సందీప్, అతని భార్య‌తో పాటు ఆమె త‌ల్లి కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

#Bharathpur #Bikers Shoot #KilledDoctors #Bh Crossing #Rajasthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు