పెద్ద కంటైనర్‌ తలపై నుండి పోయినా బతికేశాడు... ఇతడిని ఏమనాలో మీరే చెప్పండి

దురదృష్టం వెంట ఉంటే వెనుక వెంట వచ్చే సైకిల్‌ గుద్దుకుని కింద పడి చనిపోయే అవకాశం ఉంది.కాని అదృష్టం బాగుంటే మాత్రం రైలు మీద నుండి పోయినా బతికేస్తారు.

 Biker Survives Getting His Head Run Over By A Truck-TeluguStop.com

అందుకే ఈ భూమి మీద ఇంకా నూకలు ఉంటే దేవుడే వచ్చినా యముడు వెళ్లనివ్వడు అంటారు.తెలుగులో ఉన్న సామెతకు తాజాగా జరిగిన ఈ సంఘటనకు చాలా దగ్గర పోలికలున్నాయి.

ఆ వ్యక్తికి భూమి మీద నూకలు ఉండటం వల్లే అత్యంత పెద్ద కంటైనర్‌ బండి అతడి తలపై నుండి వెళ్లినా కూడా బతికేశాడు.బతకడమే కాదు, లేచి నిలబడి, మళ్లీ యదావిదిగా వెళ్లాడు.

ఈ వింతైన యాక్సిడెంట్‌ మన పిలిపిన్స్‌ దేశంలోని కైంటాలో గత ఏడాది జరిగింది.మహారాష్ట్రలోని నాగపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు.ఆ యాక్సిడెంట్‌ వీడియోను మన దేశానికి చెందిన పోలీసులు ఎందుకు విడుదల చేశారా అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటీ అంటే హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడాలంటూ నాగపూర్‌ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

హెల్మెట్‌ ఉండటం వల్ల ఇలా ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటూ ఈ వీడియో చూపుతున్నారు.

పెద్ద ట్రక్‌ తలపై నుండి పోయినా కూడా హెల్మెట్‌ ఉండటం వల్ల అతడికి ఏం కాలేదు.ఇండియాలో హెల్మెట్‌ వాడకం చాలా తక్కువ.ఫైన్స్‌ అయినా కడతామంటున్నారు కాని హెల్మెట్‌ మాత్రం పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

దాంతో నాగపూర్‌ పోలీసులు ఈ వినూత్న వీడియోను షేర్‌ చేశారు.బ్రతుకుపై తీపి ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూస్తే ఆ రోజు వరకు లేదంటే ఒక రెండు వారాల వరకు అయినా హెల్మెట్‌ పెట్టుకోవాలనుకుంటున్నారు.

కొందరైతే హెల్మెట్‌ ఇక జీవితాంతం పెట్టుకోవాలనుకుంటున్నారు.

ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.

అందుకే హెల్మెట్‌ పెట్టుకుంటే ఆ ప్రమాదం తప్పించుకోవచ్చు.అందుకే ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించండి.

మీ స్నేహితులతో ఈ విషయాన్ని షేర్‌ చేసి హెల్మెట్‌ ధరించేలా చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube