రహదారిపై ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు

ప్రస్తుత ఆధునిక సమాజంలో సోషల్ మీడియా అంటే యువతకు పిచ్చి పట్టుకుంది.కామెంట్లు, లైకులు, షేర్లు రావాలని ఎంత ప్రమాదకర విన్యాసాలైనా చేసేస్తున్నారు.

 Bike Stunts In Dangerous Mode On The Road , Highway , Stunts , Viral Latest , N-TeluguStop.com

తమ ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు.తాజాగా ఓ విద్యార్థి ఇలాగే చిత్రవిచిత్రంగా బైక్‌పై స్టంట్లు చేశాడు.

తన విన్యాసాలను ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో పెట్టాడు.ఈ విషయం చివరికి పోలీసుల వరకు చేరింది.

దీంతో అతడికి తగి శాస్తి జరిగింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల ఆగ్రాలోని రోడ్డుపై ఓ యువకుడు ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు వేశాడు.నడి రోడ్డుపై బైక్‌పై స్టంట్స్ వేయడం చూసి అటుగా వెళ్లే వారు చాలా భయపడ్డారు.

ఎక్కడ ఆ యువకుడు పడిపోతాడోనని, లేక తమకు లేని పోని ప్రమాదాలు తీసుకొస్తాడోనని ఆందోళన చెందారు.బైక్‌ రన్నింగ్‌లో ఉండగానే ఒక వైపు కూర్చుంటూ, అదే సమయంలో హ్యాండిల్ వదలేసి మరో వైపు కూర్చుంటూ ఇలా ఎన్నో స్టంట్‌లు వేశాడు.

ఈ ప్రమాదకర స్టంట్‌లను మరికొందరితో వీడియో తీయించాడు.ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.దీనికి చాలా లైక్స్ వచ్చాయి.దాంతో పాటే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

నడి రోడ్డుపై ఇలాంటి విన్యాసాలేంటని, నీతో పాటు మరికొందరి ప్రాణాలు తీస్తావా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.ఈ వైరల్ వీడియో చివరికి పోలీసులు కూడా చూశారు.

విచారణ చేపట్టి ఆ స్టంట్స్ వేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నిందితుడిపై హరిపర్వత్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సెక్షన్ 207 ఎంవీ యాక్ట్ కింద యువకుడి బైక్‌ను సీజ్ చేశారు.నిందితుడి పేరు ఆరిఫ్‌గా గుర్తించారు.

నిందితుడు ఆరిఫ్ అతుస్ సమీపంలోని సికంద్రా గ్రామ నివాసి.అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube