రేస్ మధ్యలో గొడవ పడ్డ బైక్ రేసర్స్! అసలు కారణం తెలిసి అందరూ ఆశ్చర్యం  

రేస్ మధ్యలో గొడవపడి కొట్టుకున్న బైక్ రైడర్స్. .

Bike Raiders Fighting Each Other In Race-bike Race,bike Raiders,fighting,sports

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఇండియాలో రోడ్లపై ట్రాఫిక్ లో వెహికల్స్ అనుకోకుండా ఒకదానికి ఒకటి గుద్దుకుంటే నడి రోడ్డు మీద వెహికల్స్ రెండూ ఆపేసి అందులో ఉన్నవారు గొడవపడటం మొదలెడతారు. వాళ్ళిద్దరి కారణంగా వెహికల్స్ మొత్తం నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది...

రేస్ మధ్యలో గొడవ పడ్డ బైక్ రేసర్స్! అసలు కారణం తెలిసి అందరూ ఆశ్చర్యం-Bike Raiders Fighting Each Other In Race

ఇలాంటి ఇబ్బందులు ప్రతి రోజు మన రోడ్లపై ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉంటాం.

ఇక అసలు విషయంలోకి వస్తే ఇంచు మించు ఇలాంటి సంఘటనే కోస్టారికాలో నిర్వహించిన మోటర్‌సైకిల్ రేసింగ్‌లో జరిగింది. రేస్ ట్రాక్‌పై బైక్స్ తో పరుగులు తీస్తున్న ఇద్దరు ఒకరిని ఒకరు ఢీకొన్నారు.

దీంతో ఒక బైక్ డ్రైవర్ అదుపుతప్పి రెండవ మోటార్ సైకిల్‌పై పడ్డాడు. ఈ సంఘటనలో ప్రమాదం పెద్దగా లేకపోయినా రేస్ గ్రౌండ్ లో ఇద్దరు బైకర్స్ కుమ్ములాడుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

బైక్ రేసర్స్ ఇద్దరు కొట్టుకోవడం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ఘటన కోస్టారికాలోని అలాజుయెలా పట్టణంలో నిర్వహించిన నేషనల్ మోటార్ బైక్ ఛాపియన్ షిప్‌లో ఈ సంఘటన చేసుకుంది. రేసర్ జార్జ్ మార్టినెజ్ నడుపుతున్న బైక్ మరో రేసర్ మరియోన్ కాల్వే బైక్‌ను వెనుకనుంచి ఢీకొంది...

దీంతో కాల్వే తన బైక్‌ను ఒకపక్కకు తీసుకువచ్చారు. అయితే కోపంతో మార్టినెజ్ కాల్వేను కొట్టడం ప్రారంభించాడు. వారి గొడవని చూసిన నిర్వాహకులు రేసింగ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.