ఇదేందయ్యా ఇది : పెళ్లి మీద అభిప్రాయం చెప్పమంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ రిపోర్టర్ ని...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఎలాంటి విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా ఓ న్యూస్ రిపోర్టర్ యువకుడిని పెళ్లి మరియు కట్నం అనే అంశంపై ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 Bihar Young Men Propose By News Reporter While Interview, Bihar News, News Repor-TeluguStop.com

అయితే ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే బీహార్ కి చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ సమాజంలో కట్నం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు స్థానిక ప్రజలతో ఇంటర్వ్యూ నిర్వహించింది.ఈ క్రమంలో ఓ యువకుడిని ఈ విషయంపై అడగ్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి ఆడ పిల్లల జనాభా తగ్గిపోయిందని అంతేకాక పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు ఉంటే చాలని కట్న కానుకలు అవసరం లేదని తెలిపాడు.

ఆ తరువాత ఏకంగా న్యూస్ రిపోర్టర్ ని నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాని మీకు ఇష్టమేనా అంటూ పెళ్లి ప్రపోజల్ చేశాడు.దీంతో ఒక్కసారిగా న్యూస్ రిపోర్టర్ ఖంగు తింది.

 అయితే ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఈ సంఘటనని తన చరవాణిలో బంధించి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

దీంతో ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడపిల్లలని పురిట్లోనే చంపేస్తున్నారని అందువల్లే ప్రస్తుతం పెళ్లి కోసం ఆడపిల్లలు కరువయ్యారని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube