కాలుష్యం విషయంలో బీహార్ సర్కార్ సంచలన నిర్ణయం  

Bihar To Stop Using Over 15 Years Old Vehicles-bihar Cm Nithis Kumar,bihar Governament,old Vehicles

దీపావళి సంబరాలు ముగిసిన తరువాత ఉత్తర భారతదేశంలో కాలుష్యం పెరిగి పోతున్న విషయం తెలిసిందే.ఈ కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఢిల్లీ లో కూడా కాలుష్య నివారణ కోసం తీవ్ర స్థాయిలో చర్యలు చేపట్టిన విషయం విదితమే.అయితే ఇప్పుడు తాజాగా బీహార్ ప్రభుత్వం కూడా కాలుష్య నివారణ కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.

Bihar To Stop Using Over 15 Years Old Vehicles-bihar Cm Nithis Kumar,bihar Governament,old Vehicles Telugu Viral News Bihar To Stop Using Over 15 Years Old Vehicles-bihar Cm Nithis Kumar Bihar Governa-Bihar To Stop Using Over 15 Years Old Vehicles-Bihar Cm Nithis Kumar Bihar Governament Vehicles

15 ఏళ్ల పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా నిషేధించాలని బీహార్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

15 ఏళ్ల కాలం తీరిన ప్రభుత్వ వాహనాలు, వాణిజ్య వాహనాలను పాట్నాతోపాటు పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైకి రాకుండా నిషేధం విధించాలని సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ నిషేధాన్ని మంగళవారం నుంచి అమలు చేస్తున్నామని ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.దీనిలో భాగంగా రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లుతున్న పాత వాహనాలను నిషేధించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు.అలానే కాలుష్య నివారణ కోసం పొలాల్లో అగ్గి మంటలు పెట్టే రైతులను కూడా సీఎం నితీష్ కుమార్ హెచ్చరించారు.

పొలాల్లో ఈ విధంగా అగ్గి మంటలు పెట్టె రైతులకు వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.ఉత్తర భారతదేశంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బీహార్ సర్కారు పాత వాహనాలపై నిషేధాస్త్రం విధించినట్లు తెలుస్తుంది.