ఆ థియేటర్లో జనవరి 1 నుంచి సినిమాలు ఫ్రీ.. కానీ..?

సాధారణంగా థియేటర్ లో సినిమా చూడాలంటే 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ప్రాంతాన్ని బట్టి ఖర్చు చేయాల్సి ఉంటుంది.50 శాతం సీటింగ్ కెపాసిటీ నిబంధనల వల్ల పలు ప్రాంతాల్లో టికెట్ రేటు పెంచి ఎక్కువ మొత్తం ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్నారు.అయితే ఒక థియేటర్ ఓనర్ మాత్రం జనవరి నెల 1వ తేదీ నుంచి సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కల్పించాడు.అతని థియేటర్ లో జీవితాంతం ఉచితంగా సినిమాలను చూడవచ్చు.

 Bihar Movie Theatre Offers Lifelong Free Tickets For Military Ersonnel, Airprce,-TeluguStop.com

అయితే అలా ఉచితంగా సినిమాలు చూసే అవకాశం అందరికీ లేదు.నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉచితంగా సినిమాలను చూడవచ్చు.

ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారితో పాటు మాజీ ఉద్యోగులకు పాట్నాలో ఉన్న రీజెంట్ ఫన్ థియేటర్ ఈ అవకాశం కల్పిస్తోంది.థియేటర్ ఓనర్ సిన్హా మాట్లాడుతూ సరిహద్దుల్లో దేశంలోని ప్రజల రక్షణ కోసం కాపలా కాస్తున్న వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Telugu Airprce, Bihar Theatre, Navy-Latest News - Telugu

త్రివిధ దళాలకు చెందిన వారు ఆన్ లైన్ లో లేదా కౌంటర్ లో ఐడీ కార్డు సహాయంతో ఫ్రీ టికెట్ పొందే అవకాశం ఉంది.థియేటర్ ఓనర్ సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఆర్మీ అధికారులు సైతం సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.మరోవైపు కరోనా ఉధృతి తగ్గడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద సినిమాలు విడుదలయ్యేవి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల షూటింగులు ఆలస్యం కావడంతో 2021 సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube