'మోరే' లో ఎమ్మెల్యేల నిర్వాకం, స్థానిక యువతులతో అసభ్యకర నృత్యాలు  

Bihar Mla\'s Enjoy Sensual Dance With Local Girls-enjoy Y Dance,indo Mayanmar Border Town,local Girls,manipure,ఇండో-మయన్మార్ బోర్డర్ టౌన్,మణిపూర్

అధికారం చేతిలో ఉంటె ఏదైనా చెయ్యొచ్చు అన్న ధీమా నేతలలో పెరిగిపోయింది. ఇటీవల నేతల ఆగడాలకు సంబంధించి ఎన్ని వీడియో లు బయటకొస్తున్నా కూడా ఎవరూ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు ఉంటున్నారు. తాజాగా బీహార్ ఎమ్మెల్యే ల సెల్ఫీ డాన్సులకు సంబంధించి వీడియో ఒకటి బయటకు పచ్చింది..

'మోరే' లో ఎమ్మెల్యేల నిర్వాకం, స్థానిక యువతులతో అసభ్యకర నృత్యాలు -Bihar MLA's Enjoy Sensual Dance With Local Girls

వారొక్కరే డ్యాన్స్ చేస్తే పారలేదు,కానీ స్థానిక యువతులతో కలిసి అసభ్యకర నృత్యాలు చేయడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇండో-మయన్మార్ బోర్డర్ టౌన్, మణిపూర్ లోని మోరే లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ ఎమ్మెల్యేలు స్టడీ టూర్ అంటూ మోరే కి వచ్చారు.

అయితే అక్కడ స్థానిక యువతులతో కలసి అసభ్యకర నృత్యాలు చేస్తూ దానిని వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో అదికాస్తా వైరల్ గా మారింది. స్టడీ టూర్ అంటూ మోరేకి వచ్చిన ఆర్జెడీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్, బీజేపీకి చెందిన సచిన్ ప్రసాద్ సింగ్, జేడీయూకి చెందిన ఎమ్మెల్యే రాజ్ కుమార్ రాయ్, ఆర్జెడీకి చెందిన శివచంద్రరామ్ లు స్థానిక యువతుల తో కలిసి ఆడిపాడారు.

యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నుంచి అమలు చేయాలి అని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఈ విధంగా ఎమ్మెల్యే లు బిహేవ్ చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు కూడా వారిపై మండిపడుతున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అమలు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు అంటూ మోరేకి వచ్చిన యదువంశ్ కుమార్ చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇదా అని వారంతా మండిపడుతున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యే లపై తగిన చర్యలు తీసుకొని వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.