వంట చేయలేకపోతున్న సిబ్బంది,కారణం క్వారంటైన్ సెంటర్ లో కుంభకర్ణుడట!  

Bihar Man Quarantine Center - Telugu Bihar Man, Bihar Man Eat 10 Members Food, Coronavirus, Lock Down, Quarantine Center

పురాణాల గురించి తెలిసిన వారికి కుంభకర్ణుడి గురించి తెలిసే ఉంటుంది.రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు ఆకలి వేస్తే ఏ రేంజ్ లో తినే వాడో,అందుకే ఎవరైనా ఎక్కువ మోతాదులో తింటున్నప్పుడు గబుక్కున కుంభకర్ణుడి లాగా తింటున్నావు అని అంటూ ఉంటాం.

 Bihar Man Quarantine Center

సరిగ్గా క్వారంటైన్ సెంటర్ లో కూడా ఇలాంటి ఒక కుంభకర్ణుడే తగిలాడట.ఆయనగారికి వంట చేయలేక సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారట.

బిహార్‌‌లోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.వలస కార్మికుడు తింటున్న తిండి చూసిన వారంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారట.

వంట చేయలేకపోతున్న సిబ్బంది,కారణం క్వారంటైన్ సెంటర్ లో కుంభకర్ణుడట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎవరైనా ఆకలేసి తింటే కాస్తో కూస్తో ఎక్కువగా తింటారు.

కానీ ఈ వ్యక్తి మాత్రం ఆస్తులు అమ్ముకునేలా తింటుడున్నాడు.

ఏకంగా 10 మందికి సరిపోయే ఆహారం ఒక్కడే తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.దీంతో క్వారంటైన్ సిబ్బంది అతనికి వండి పెట్టలేం బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారట.

వివరాల్లోకి వెళితే… అనూప్‌ ఓజా(23) ఉపాధి కోసం రాజస్తాన్‌ వెళ్లాడు.లాక్‌డౌన్‌ విధించడంతో బక్సర్‌లోని మంజ్‌వారీ గ్రామానికి వచ్చాడు.

నిబంధనల ప్రకారం అతన్ని 14 రోజులు క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు.ఇదే వారు చేసిన తప్పైంది.

అనూప్ ప్రతి రోజు తింటున్న తిండి చూసి ఇదేం తిండి అనుకుంటున్నారట.ఉదయాన్నే టిఫిన్‌లో 40 చపాతీలు, మధ్యాహ్నం 8-10 ప్లేట్ల ఆహారం తీసుకుంటున్నాడు.

ప్రభుత్వం మాత్రం ప్రతి వ్యక్తికి నిర్ధిష్టమైన ఆహారం అందించాలని సూచించింది.అయితే ఇతడి అసాధారణ ఆకలి చూసి నిర్వాహకులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం తో అధికారులు వచ్చి పరిశీలించగా నిజమేనని తేలింది.

దీనితో ఇక చేసేదేమి లేక ప్రతి రోజు అతగాడు అడిగినంత ఆహరం అందించాలి అంటూ ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ సంఘటన ఆనోటా ఈ నోట చేరి వైరల్ గా మారింది.

దీనితో క్వారంటైన్ సెంటర్ లో కుంభకర్ణుడు అంటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test