వీడియో: ఫిమేల్ బ్యాంక్‌ మేనేజర్‌పై కస్టమర్ ప్రతాపం.. ఆమె ఫోన్ బద్దలు కొట్టాడు..!

తాజాగా పట్నాలోని( Patna ) ఒక కెనరా బ్యాంకు( Canara Bank ) బ్రాంచ్ లో ఒక దారుణ సంఘటన జరిగింది.

శుక్రవారం, ఒక వ్యక్తి బ్యాంకు మేనేజర్‌ను బెదిరించి ఇబ్బంది పెట్టాడు.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటన గుడి మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఆ మేనేజర్ పేరు వందనా వర్మ( Vandana Verma ) అని తెలిసింది.ఆమెను బెదిరించిన కస్టమర్ పేరు రాకేష్ కుమార్ సింగ్.

( Rakesh Kumar Singh ) రాకేష్ ఒక కాంట్రాక్టర్‌.అతనికి డబ్బు అవసరం పడింది అందుకే కెనరా బ్యాంకులో రుణం తీసుకోవాలనుకున్నాడు.

Advertisement

ముందుగా దరఖాస్తు చేసుకున్నాడు.కానీ, రాకేష్‌కున్న క్రెడిట్ స్కోర్ బాగా లేకపోవడంతో బ్యాంకు రుణం మంజూరు చేయలేదు.

దీంతో ఆగ్రహించిన రాకేష్, బ్యాంకు మేనేజర్ వందనను బెదిరించాడు.“నా క్రెడిట్ స్కోర్ సరి చేయి లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు.

నాలాంటి వాడిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండవు.నా గురించి ఎవరినైనా అడిగి చూడు” అని బెదిరించాడు.

వందన అతడి బెదిరింపులను మొబైల్‌లో రికార్డ్ చేయడం మొదలుపెట్టగా, రాకేష్ ఆమె ఫోన్‌ను నేలమీద విసిరి కొట్టాడు.దాంతో ఆ మొబైల్ ముక్కలు అయింది.ఇది ఊహించని మేనేజర్ వందన మరింత భయంతో వణికి పోయింది.

డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా... పోలీసుల తీరుపై మండిపడిన బన్నీ!
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ఆ తర్వాత కూడా అతను ఒక కుర్చీలో ఆమె ముందు కూర్చొని బెదిరించడం చూడవచ్చు.ఈ మొత్తం ఘటన వీడియోలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

వందన గుడి మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు వెంటనే స్పందించి రాకేష్ కుమార్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పట్నా పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సంఘటన గురించి పోలీసులు ట్వీట్ చేసి, అరెస్ట్‌ను ధృవీకరించారు.

ఈ ఘటన, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడిస్తుంది.వర్క్ ప్లేసు వద్ద ప్రతి ఒక్కరికి తగినంత సేఫ్టీ ఉండాలనే అవసరాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతుంది.

తాజా వార్తలు