అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా,గురుడు చేసిన పనికి ఖంగుతిన్న జనం  

Bihar Groom Celebratory Gun Firing During Wedding-groom Gun Fire,gun Firing,wedding Celebrations,పెళ్లి కొడుకు,బీహార్

బీహార్ లో పెళ్లి కొడుకు పెళ్లి మధ్యలో ఫైరింగ్ చేసి సంచలనం సృష్టించాడు.ఒకపక్క పెళ్లి హడావుడిలో అందరూ మునిగి ఉండగా వేదిక వద్దకు వచ్చిన పెళ్లి కొడుకు ఎగ్జైట్మెంట్ కు గురయ్యాడో ఏమో గానీ ఉన్నట్టుండి గాల్లోకి కాల్పులు జరపడం తో అందరూ దిగ్బ్రాంతి కి గురయ్యారు.

Bihar Groom Celebratory Gun Firing During Wedding-Groom Fire Gun Wedding Celebrations పెళ్లి కొడుకు బీహార్

ఉన్నట్టుండి పెళ్లి వేడుక వద్దకు చేరుకున్న గురుడు కాల్పులు జరపడం తో అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడం తో అందరూ క్షేమంగా ఉన్నారు.

ఇలా పెళ్లి మధ్యలో కాల్పులు జరపడం ఇదేం తొలిసారి కాదు.గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో బీహార్ లో చోటుచేసుకున్నాయి.

అయితే ఇలాంటి ఘటనల్లో పలువురు గాయపడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.ఇలా పెళ్లి వేడుకల్లో గన్ ను వాడే కల్చర్ అక్కడ సాధారణం అయిపొయింది.

అయితే తాజాగా ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ అవ్వడం తో ఇక నెటిజన్లు తమదైన శైలి లో కామెంట్లు చేశారు.

అయినా పెళ్లి మండపానికి పెళ్లి కోసం వచ్చి ఇలా వరుడే గాల్లోకి కాల్పులు జరపడం ఏంటి అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.అయినా పెళ్లి వేడుకల్లో ఈ గన్ కల్చర్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని, మరోసారి ఇలాంటి సీన్ లు రిపీట్ కాకుండా చూడాలి అంటూ నెటిజన్లు కోరుతున్నారు.

ఏది ఏమైనా సరదా ఉంటె ఉండొచ్చు మరీ ఇలా గన్ ని గాల్లోకి పేల్చి మరీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదు.

తాజా వార్తలు

Bihar Groom Celebratory Gun Firing During Wedding-groom Gun Fire,gun Firing,wedding Celebrations,పెళ్లి కొడుకు,బీహార్ Related....