విడ్డూరం: కరోనా టైంలో కండోమ్‌ల పంపిణీ.. ఎక్కడో తెలుసా?  

Bihar Government Distributes Condoms To Migrants - Telugu Bihar Government, Condoms, Migrant Workers, Weird News

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది కేంద్ర ప్రభుత్వం.ఈ కారణంగా అన్ని రంగాలకు చెందిన పనులు మూతపడటంతో ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.

 Bihar Government Distributes Condoms To Migrants

ముఖ్యంగా వలస కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం.వారు తమ సొంతగూటికి చేరేందుకు కొన్ని వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు సభ్యసమాజాన్ని కదిలిస్తున్నాయి.

ఈ క్రమంలోనే అనేకమంది వలస కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.

విడ్డూరం: కరోనా టైంలో కండోమ్‌ల పంపిణీ.. ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే వలస కార్మికులు తమ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టగానే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వారిని క్వారంటైన్‌లో పెట్టిన తరువాతే ఇంటికి పంపేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.అయితే ఈ క్రమంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వలస కార్మికులకు కండోమ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది.14 రోజులు క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారికి బీహార్ ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవాంఛిత గర్భాలను అడ్డుకునేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అటు బీహార్‌కు దాదాపు 9 లక్షలకు పైగా వలస కార్మికులు తిరిగి రావడంతో వారందరినీ క్వారంటైన్‌లో పెట్టామని, వారందరికీ కండోమ్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.మొత్తానికి వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఇలాంటి ఆలోచనతో వార్తల్లోకెక్కిన బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bihar Government Distributes Condoms To Migrants Related Telugu News,Photos/Pics,Images..

footer-test