సుశాంత్ మృతి విషయంలో బీహార్ సీఎం సైతం…!  

Nitish kumar recommands CBI investigation on Sushant\'s death , Nitish kumar, Sushant\'s death , CBI investigation - Telugu Cbi Investigation, Nitish Kumar, Nitish Kumar Recommands Cbi Investigation On Sushant\\'s Death, Sushant’s Death

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన ఎవరూ జీర్ణించుకోలేకపోతున్న విషయం విదితమే.అతడు చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం అందరినీ కలచివేసింది.

TeluguStop.com - Bihar Cm Nitish Kumar Sushanth Case

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అతడి మృతి విషయంలో ఇప్పటికే భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని కొందరు అంటుంటే,కాదు అతడి మృతి వెనుక మాఫియా ఉందంటూ మరో ప్రచారం జరుగుతుంది.

TeluguStop.com - సుశాంత్ మృతి విషయంలో బీహార్ సీఎం సైతం…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇలాంటి భిన్న కధనాల నడుమ బీహార్ లో కూడా సుశాంత్ మృతి పై ఫిర్యాదు అందడం తో బీహార్ పోలీసులు కూడా ముంబై చేరుకొని విచారణ మొదలుపెట్టారు.అయితే బీహార్ పోలీసు అధికారులకు,ముంబై పోలీస్ అధికారులు ఏమాత్రం సహకరించడం లేదంటూ ఆరోపణలు కూడా వచ్చాయి.
సుశాంత్ కేసుకు సంబంధించి విచారణ కోసం వచ్చిన ఐపీఎస్ అధికారిని బలవంతంగా క్వారంటైన్ కు తరలించినట్లు స్వయంగా ఆ ఐ పీ ఎస్ అధికారి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం విదితమే.ఇదే కేసు విషయంగా బీహార్ డీజీపీ కూడా ఎదో జరుగుతుంది అని ముంబై పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏమాత్రం సహకరించడం లేదంటూ ఈ కేసు తప్పనిసరిగా సీబీఐ కి అప్పగించాలి అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు తాజాగా సుశాంత్ మృతి పై సీబీఐ దర్యాప్తు చేయాలి అంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం సిఫార్స్ చేయడం గమనార్హం.ఆయన తండ్రి కేకే ఖాన్ అభ్యర్థనను పురస్కరించుకుని తాము సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్టు నితీష్ కుమార్ పేర్కొన్నారు.

తమ రాష్ట్రంలో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది గనుక తామీ నిర్ణయం తీసుకున్నామని నితీష్ కుమార్ తెలిపారు.మరోపక్క సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు సరిగా వ్యవహరించడంలేదని సుశాంత్ తండ్రి ఖాన్ ఆరోపిస్తున్నారు.
గత ఫిబ్రవరి లోనే తన కుమారుడికి ప్రాణహాని ఉందని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసానని,అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.జూన్ 14 న సుశాంత్ తన గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అసలు అన్ని విధాలుగా పరిస్థితులు బాగున్న సుశాంత్ ఎందుకు ఆత్మహత్య వరకు వెళ్ళాడు అన్నది పెద్ద మిస్టరీ గా మారింది.దీనితో ఈ కేసు విచారణను సీబీఐ కు అప్పగించాలి అంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

#NitishKumar #Nitish Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bihar Cm Nitish Kumar Sushanth Case Related Telugu News,Photos/Pics,Images..