సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు     2015-02-17   06:57:54  IST  Bhanu C

గత కొన్ని రోజులుగా బీహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంరీa జాతీయ మీడియాలో ప్రముఖంగా ఉంటూ వస్తున్నాడు. అధికార మార్పిడికి ఎమ్మెల్యేలు ఎంతగా ప్రయత్నించినా కూడా తాను పట్టు వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్న ఈ ముఖ్యమంత్రి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత భార్య భర్తలు గడుపుతున్న సంసార జీవితం గురించి, భర్తలు చేస్తున్న డేటింగ్‌ల గురించి మాంరీa విభిన్న రీతిలో స్పందించాడు.

పెళ్లి చేసుకున్న వారిలో కేవలం అయిదు శాతం మంది మాత్రమే తమ భార్యలను తమతో పాటు బయటకు తీసుకు వెళ్తున్నారని, మిగిలిన వారు అంతా కూడా ఇతరుల భార్యలతో డేటింగ్‌లో ఉన్నారని అన్నాడు. అయితే ఇద్దరి సమ్మతితో అలా చేయడం తప్పుకాదని కూడా ఈ సీఎం చెప్పుకొచ్చాడు. భార్య, భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటున్న సమయం చాలా తక్కువ అని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి ఇతరుల భార్యలతో మాత్రం భర్తలు చాలా ప్రేమగా వ్యవహరిస్తారు అని అన్నాడు. ఈయన వ్యాఖ్యలను కొందరు అర్థం పర్థం లేని వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తుంటే మరి కొందరు మాత్రం సమర్థిస్తున్నారు.