తమిళ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాట ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇళయతలపతి అనే బిరుదు అతడికి ఉందంటే దాని వెనుక ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇక విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళనాట పండగ వాతావరణమే కనిపిస్తుంది.కానీ తాజాగా విజయ్ నటించిన బిగిల్ సినిమా రిలీజ్ మాత్రం విధ్వంసాన్ని సృష్టించింది.
తమిళనాడులోని కృష్ణగిరిలో అర్దరాత్రి వేళ విజయ్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు.బిగిల్ సినిమా ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ థియేటర్‌ను మూసేశారు.
దీంతో రెచ్చిపోయిన విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్ గేట్లు విరగ్గొట్టి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.ఈ నష్టం భారీగా ఉందని తెలుస్తోంది.
విజయ్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసానికి కోట్లలో నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో మరింత రెచ్చిపోయారు విజయ్ ఫ్యాన్స్.పోలీసు వాహనాలను కూడా వదలకుండా ధ్వంసం చేసి నానా భీబత్సం సృష్టించారు.దీంతో స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
కాగా ఈ ఘటనలో ఏకంగా 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అటు తమిళనాట అంతటా నేడు విజయ్ బిగిల్ సినిమా సందడి చేస్తోంది.