ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.
ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.ఇటీవలే ఈయన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాతో ప్రభాస్ ఎవ్వరు చేయలేని సాహసం చేసాడు.హీరోగా ఎన్ని కమర్షియల్ హిట్ లు దక్కినా సంతృప్తికర పాత్ర ఒక్కటి అయినా చేయాలనీ కొంత మంది హీరోలు అనుకుంటూ ఉంటారు.
అలాంటి సమయాల్లోనే ప్రయోగాత్మక సినిమాలు చేయాల్సి ఉంటుంది.అయితే ఇది అందరు చేయలేరు.కానీ ప్రభాస్ మాత్రం అలాంటి హీరోనే అందంలో ఎలాంటి సందేహం లేదు.ఈయనకున్ ఇమేజ్ ను పక్కన పెట్టి మరి ప్రయాగాత్మక సినిమాలు చేస్తున్నాడు.
ఈయన కు ఉన్న స్టార్ డమ్ తో ప్రయోగాత్మక సినిమాలు చేయక పోయిన కెరీర్ సాఫీగానే సాగుతుంది.
కానీ ప్రభాస్ అలా చేయకుండా ప్రయోగాలు కూడా కొన్ని సార్లు చేస్తూనే ఉన్నాడు.

అయితే ఈయన చేసిన రెండు ప్రయోగాత్మక సినిమాలు సక్సెస్ సాధించలేదు.నటుడిగా ఆయనను ఒక మెట్టు ఎక్కించిన సినిమాలు అయినప్పటికీ ఈయనకు మాత్రం అనుకున్నంత సక్సెస్ రాలేదు.ఈయన తన కెరీర్ లో రెండు ప్రయోగాత్మక సినిమాలు చేసాడు.
ఈ రెండు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ హిట్ అవ్వాలేక పోయాయి.
ఆ రెండు సినిమాలు ఏంటంటే.చక్రం, రాధేశ్యామ్.
కృష్ణ వంశీ తెరకెక్కించిన చక్రం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ అవ్వలేదు.

దీంతో ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా మిగిలి పోయింది.అయితే ఇప్పుడు రాధేశ్యామ్ ఈ సినిమా కంటే డిజాస్టర్ గా మిగిలి పోయింది.ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చక్రం సినిమా ప్రభాస్ లైఫ్ లో డిజాస్టర్ గా మిగిలి పోగా.ఇప్పుడు మాత్రం రాధేశ్యామ్ ఆ సినిమా కంటే పెద్ద డిజాస్టర్ అయ్యింది.
ఇది రాధేశ్యామ్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఎప్పటికి అలా నిలిచి పోతాయి.