ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదు.. భారత్‌కు సాయం చేయండి: ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్త పిలుపు

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌తో ఇండియా చివురుటాకులా వణికిపోతోంది.చికిత్స కోసం రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.

 Biggest Crisis India Has Seen Indian American Entrepreneur Mr Rangaswami Appeal-TeluguStop.com

దేశంలో ఏ మూల చూసినా బెడ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు.కోటాను కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా ఏం చేయలేక చివరికి చెట్ల కింద ఓ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని కరోనాతో పోరాడుతున్నారు.

మరి సామాన్యుల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.తమ వారు చనిపోయేలా వున్నారని.

ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ రోగుల బంధువులు చేస్తున్న అభ్యర్ధనలు కంటతడి పెట్టిస్తున్నాయి.ఒకవేళ దయతలచి ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది.

కిష్ట పరిస్ధితుల్లో వున్న మాతృదేశాన్ని ఆదుకునేందుకు ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు.ఇప్పటికే వివిధ భారతీయ సంఘాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, మందులు, వైద్య పరికరాలను పంపుతున్నాయి.

అంతేకాకుండా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నాయి.ఇప్పటికే ఇండో అమెరికన్ పారిశ్రామిక వేత్త వినోద్ ఖోస్లా ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు బాసటగా నిలిచారు.

ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడానికి వనరులు అసవరమయ్యే భారతీయ ఆసుపత్రులకు తాను నిధులు సమకూరుస్తానని వినోద్ ఖోస్లా ప్రకటించారు.ఆ తర్వాత మరో వారం వ్యవధిలోనే ఆక్సిజన్ అందించేందుకు గాను మరో 10 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు ఖోస్లా.

తాజాగా సిలికాన్ వ్యాలీకే చెందిన మరో భారత సంతతి వ్యాపారవేత్త, ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి సైతం తన జన్మభూమిలోని హృదయ విదారకర పరిస్ధితిపై స్పందించారు.ప్రస్తుత కోవిడ్ 19 సంక్షోభం ఇప్పటి వరకు భారతదేశం ఎదుర్కొన్న వాటిలో అతి పెదద్దిగా ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా భారత్‌ను ఆదుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.కోవిడ్ కారణంగా చెన్నైలో నివసిస్తున్న రంగస్వామి సోదరి ఇటీవల మరణించారు.

అమెరికాతో పాటు ఇతర దేశాల వారు భారత్‌ను ఆదుకునేందుకు గాను ఎంతో శ్రమిస్తున్నారని రంగస్వామి తెలిపారు.

Telugu Indians, Rangaswamy, Oxygen Cylinder, Vinod Khosla-Telugu NRI

కాగా, ఇండియాస్పోరా సంస్థ భారత్‌కు చేయూతను అందించేందుకు గాను ఇప్పటి వరకు 2.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.ఇక గత వారం ‘‘హెల్ప్ తమిళనాడు బ్రీత్’’ ప్రచారంలో భాగంగా రంగస్వామి 1.5 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించారు.దీనితో పాటు భారత్‌కు నిధులు సేకరించేందుకు గాను పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రచారాల్లో రంగస్వామి పాల్గొంటున్నారు.

ప్రస్తుత సంక్షోభం ఒక్క భారత్‌తోనే ఆగిపోదని.ఉపఖండ దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలను తాకుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశాల నుంచి వచ్చే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ముందులు, ఇతర వైద్య సామాగ్రిపై దిగుమతి సుంకాన్ని మాఫీ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రంగస్వామి స్వాగతించారు.దీనితో పాటే ఎఫ్‌సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్స్) చట్టం)లోని కొన్ని నిబంధనలను కూడా రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తద్వారా భారత్‌లోని అవసరమైన వారికి నిధులను అందించగలుగుతామని రంగస్వామి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube