ఒక్కో రాశి వారికి ఒక్కో వ్యసనం ఉంటుంది.. మీ రాశి ప్రకారం మీ వ్యసనం ఏమిటో తెలుసా?   Biggest Addiction Each Zodiac Sign Revealed     2018-01-20   21:48:55  IST  Raghu V

ప్రతి మనిషికి ఒక్కో రకమైన అభిరుచులు,ఆసక్తులు ఉండటం సహజమే. అలాగే కొన్ని వ్యసనాలు ఉండటం కూడా సహజమే. కొంత మందికి షాపింగ్ వ్యసనం ఉంటే కొంత మందికి తిండి వ్యసనం ఉండవచ్చు. అయితే రాశి ప్రకారం మీకు ఏ వ్యసనం ఉందో తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రాశి వారికీ కాఫీ అంటే పిచ్చి. ఏ మాత్రం కాస్త నిరాశ అనిపించినా వెంటనే కాఫీ త్రాగి రిలాక్స్ అవుతూ ఉంటారు. వీరికి కాఫీ త్రాగటం అంటే చాలా ఇష్టం. వీరు కాఫీ లేకుండా అసలు ఉండలేరు. ఒక విధంగా చెప్పాలంటే కాఫీ వీరికి ఒక వ్యసనం.

వృషభం
ఈ రాశి వారికి ఎక్కువగా తినాలనే కోరిక ఉంటుంది. వీరు ఎక్కువగా జంక్ ఫుడ్స్ అంటే ఇష్టపడతారు. అందుకే ఈ రాశి వారు ఎక్కువగా ఫ్యాటీగా తయారవుతారు. వీరికి ఫ్రైడ్ ఫుడ్స్ ,జంక్ ఫుడ్స్ వ్యసనం.

మిధున రాశి
ఈ రాశివారు ఎక్కువగా పుస్తకాలను చదువుతూ నాలెడ్జ్ ని పెంచుకుంటారు. వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అంతేకాక వీరికి చాలా విషయాలపై అవగాహనా ఉంటుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారు ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరిని ఎవరైనా ఏమైనా అంటే గంటల తరబడి కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఫీల్ అయ్యి మనస్సులో కృంగిపోతూ ఉంటారు.

సింహ రాశి
ఈ రాశి వారు తమ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా ఊహించుకుంటారు. తమ కన్నా ఎవరు గొప్పవారు కాదని ఫిల్ అవుతూ గర్వంగా ఉంటారు. ఎప్పుడు తన గొప్ప గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించటం వీరి వ్యసనం.

కన్య రాశి
ఈ రాశి వారికి శుభ్రత అంటే చాలా పిచ్చి. వీరు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ మాత్రం శుభ్రత లేకుండా వీరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వీరితో పాటు పక్కవారు కూడా శుభ్రత పాటించాలని అనుకుంటారు. వీరికి పరిశుభ్రత వ్యసనం.

తుల రాశి
ఈ రాశి వారికీ షాపింగ్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. వీరి దృష్టి అంతా ఎప్పుడు వెకెండ్ వస్తుందా ఎప్పుడు షాపింగ్ చేద్దామా అనే దాని మీదే ఉంటుంది. కొన్న వస్తువులనే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు.

వృశ్చికరాశి
ఈ రాశి వారికి శృంగారం అంటే పిచ్చి. ఎప్పుడు ఆ ఆలోచనలతోనే ఉంటారు.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి జూదం అంటే మహా పిచ్చి. ఎప్పుడు వీరు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ రిస్క్ చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ రాశి వారు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. రకరకాల బెట్టింగ్ వేస్తూ ఉంటారు.

మకర రాశి
ఈ రాశి వారు ఎక్కువగా పని మీద దృష్టి పెట్టి అన్నింటిని మర్చిపోతూ ఉంటారు. ఆఫీస్ అయినా ఇళ్లు అయినా గంటల తరబడి పనిలో మునిగిపోతారు. వీరు పనిలో పడితే అన్ని మర్చిపోతారు.

కుంభ రాశి
ఈ రాశి వారు ఎక్కువగా త్రాగుతూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వీరు పని ఒత్తిడి తగ్గించుకోవటానికి పార్టీలకు వెళుతూ ఉంటారు. ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురుచూస్తూ వీకెండ్ రాగానే త్రాగటంలో బిజీ అయ్యిపోతారు.

మీన రాశి
ఈ రాశి వారు ఎక్కువగా ఆందోళనకు గురి అవుతారు. వీరు ప్రతి చిన్న విషయానికి చాలా ఆందోళన పడుతూ ఉంటారు. వీరు టెన్షన్ లో ఉన్నప్పుడు పాటలు వినటం లేదా రెస్టారెంట్ కి వెళ్ళటం చేస్తూ ఉంటారు.