బిగ్‌బాస్‌5 : ఈవారం ఎలిమినేషన్‌ తప్పని పరిస్థితుల్లో జెస్సీనే!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ రాబోతుంది.ఈ వారం ఎలిమినేషన్ లో కాజల్‌, సన్నీ, సిరి, మానస్‌ మరియు రవిలు ఉన్నారు అయిదుగురులో కాజల్‌ బయటకు వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.

 Biggboss5 This-week Eliminated Contestant Jessie Biggboss5 This Week Eliminated-TeluguStop.com

కాని తాజాగా మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ నుండి నామినేషన్ కు అయిన వారు ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వక పోవచ్చు.వారికి బదులుగా సీక్రెట్‌ రూమ్‌ లో ఉన్న జెస్సీ ని ఎలిమినేషన్ చేస్తారేమో అంటున్నారు.

ఎందుకంటే పూర్తిగా ఆరోగ్య పరమైన చెకప్స్ చేయించి క్వారెంటైన్ లో ఉన్నా కూడా జెస్సీ ఇంకా కూడా బాగు కాలేదు.అందుకే జెస్సీ కి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 లో నుండి జెస్సీ బయటకు వెళ్లడం కన్ఫర్మ్‌ అయ్యింది.తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న జెస్సీ ఇలా అర్థాంతరంగా వెళ్లి పోవడం బాధను కలిగిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Bigg Boss, Jessie, Kajal, Ravi, Siri, Vj Sunny-Movie

పెద్ద మొత్తంలో అంచనాలున్న ఈ వారం ఎలిమినేషన్ ను ఇలా చప్పగా చల్లార్చుతారా లేదంటే జెస్సీ కాకుండా మరొకరిని కూడా ఎలిమినేట్‌ చేస్తారా అనేది చూడాలి.పెద్ద ఎత్తున ఈసారి ఓట్లు పడ్డాయి.నామినేషన్‌ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ కూడా మంచి ఆట తీరును కలిగి ఉన్నాడు.

కనుక ఈ సీజన్ లో అతి ముఖ్యమైన వారంగా ఈ వారం ఉంటుందని అంతా ఆశించారు.కాని అనారోగ్యంతో జెస్సీ ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.

ఇంతకంటే ట్రాజిడీ ఏమీ లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube