షన్నూ ఏడుపును మళ్లీ ఏకి పారేస్తున్న నెటిజన్స్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్‌ షన్నూ అనడంలో సందేహం లేదు.యూత్‌ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆయనకు భారీ ఎత్తున మద్దతు మొదట్లో లభించింది.

 Biggboss5 Shannu And Siri Gets Trolls Again, Biggboss , Shannu ,siri , Telugu Biggboss , Biggboss 5-TeluguStop.com

ఆ సమయంలో చాలా మంది ఆయన్ను కనీసం నామినేట్ చేసేందుకు కూడా ఇష్టపడే వారు కాదు.ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సేవ్‌ అవుతాడు.

అలాంటప్పుడు ఆయన్ను నామినేట్‌ చేసి బ్యాడ్ అవ్వడం ఎందుకు అనుకుని చాలా మంది కంటెస్టెంట్స్ మొదటి అయిదు ఆరు వారాల పాటు నామినేషన్ చేయకుండా సీక్రెట్ టాస్క్ సమయంలో మాత్రమే అతడిపై రివేంజ్ అన్నట్లుగా నామినేట్‌ చేయడం జరిగింది.అతడి క్రేజ్ బయట మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది.

 Biggboss5 Shannu And Siri Gets Trolls Again, Biggboss , Shannu ,siri , Telugu Biggboss , Biggboss 5-షన్నూ ఏడుపును మళ్లీ ఏకి పారేస్తున్న నెటిజన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిరితో అతడు వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.

సిరిని మానసికంగా అత్యాచారం చేస్తున్నాడని.

పదే పదే ఆమె పై అలగడం.ఆమెను ఇబ్బంది పెట్టడం చేశాడు అంటూ అసంతృప్తి వ్యక్తం అయ్యింది.

షన్నూ మొదటి నుండి కూడా సిరి పట్ల వ్యవహరిస్తున్న తీరు కు ఏం పేరు పెట్టాలో అర్థం కాక జనాలు మరియు ఆయన అభిమానులు కూడా మెల్ల మెల్లగా అతడికి దూరం అవుతున్నారు.ఆయనపై అభిమానం తగ్గి కోపం పెరిగి ట్రోల్స్ మొదలు అయ్యాయి.

షన్నూ పదే పదే ఏడ్చేయడం.సిరిని తిట్టడం.ఆమె వల్ల పదే పదే చిరాకు పడటం వంటివి చేస్తూ వచ్చాడు.తాజాగా ఎపిసోడ్‌ లో కూడా సిరి ఫేక్ ఎలిమినేషన్ అనే విషయం కనీస ఆలోచన లేకుండా ఏడ్వడం మొదలు పెట్టాడు.

మరో రెండు రోజుల్లో వెళ్లి పోయేదే కదా ఎందుకు అంత ఏడుపు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.అది అంతా కూడా డ్రామా అని మళ్లీ నిరూపించారు అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube