ఆ అమ్మాయిలందరికి షన్నుతో లింక్.. బిగ్ బాస్ హైడ్రామా?

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా గత 11 రోజుల నుంచి బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమౌతూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల కోసం కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతో హౌస్ సభ్యుల మధ్య గొడవలు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి.

 Biggboss5 11th Day Highlights Umadevi Comments On Shanmukh Siri Next Captain Winner Viswa-TeluguStop.com

ఇలా మొదటి కెప్టెన్,రెండవ కెప్టెన్ కోసం బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లలో కంటెస్టెంట్ లు ఎంతో పోటీగా పాల్గొని చేసిన రచ్చ మామూలుగా లేదు.ఈ టాస్క్ లో భాగంగా ఏకంగా కంటెస్టెంట్ లో కొట్టుకునే వరకు వెళ్లారు.

ఇదిలా ఉండగా హౌస్ లోని కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ కి హౌస్ లో ఉన్నటువంటి హమీదా, సిరిలతో లింకులు పెడుతూ మరొక డ్రామాకు తెర తీసినట్లు తెలుస్తోంది.

 Biggboss5 11th Day Highlights Umadevi Comments On Shanmukh Siri Next Captain Winner Viswa-ఆ అమ్మాయిలందరికి షన్నుతో లింక్.. బిగ్ బాస్ హైడ్రామా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగానే హౌస్ లో సింగిల్ బెడ్ లేనటువంటి లోబో,ఉమా దేవిల మధ్య టాస్క్ నిర్వహించి వీరిద్దరిలో ఎవరు సభ్యులను బాగా నవ్విస్తారో వారికి సింగిల్ బెడ్ ఉంటుందని చెప్పారు.

Telugu Bigg Boss 5, Deepthi Sunayana, Highdrama, Reality Show, Shanmukh Jaswanth, Siri, Umadevi Comments-Movie

ఈ క్రమంలోనే లోబో, ప్రియాంక సపోర్టుతో టాస్క్ చేసి అందరినీ ఎంతో నవ్వించారు.అదేవిధంగా ఉమాదేవి కంటెస్టెంట్ సిరితో కలిసి అత్త కోడలి మాదిరిగా నటిస్తూ తన కొడుకు షణ్మఖ్ అంటూ సిరికి షణ్ముఖ్ మధ్య లింక్ పెట్టింది.అదేవిధంగా గురువారం షన్ను పుట్టినరోజు కావడంతో హౌ సభ్యులందరూ ఎంతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.

ఈ క్రమంలోనే కాజల్ షణ్ముఖ తో మాట్లాడుతూ.హమీదాలో నచ్చే క్వాలిటీస్ చెప్పు అని అడగగా షణ్ముఖ్ సిగ్గుపడుతూ షీ ఈస్ హార్డ్ అంటూ చెప్పడంతో అతనిపై రవి సెటైర్లు వేస్తాడు.

ఇక పిల్లో పై హెచ్ (హమీద) అనే లెటర్ రాస్తానని రవి అనడంతో అందుకు హమీదా స్పందిస్తూ.హౌస్ లో ఉన్నప్పుడు పిల్లో పై హెచ్ అని నా పేరు పెట్టుకో హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత డి (దీప్తి సునయన) పేరు పెట్టుకో అంటూ మాట్లాడటం చూస్తుంటే బిగ్ బాస్ వీరి మధ్య ఏదో డ్రామా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మొత్తానికి హామీదా విషయంలో షణ్ముఖ్ ని, లహరి, యాంకర్ రవి ఆటపట్టించడం హైలెట్ గా మారింది.

#Highdrama #Reality Show #Bigg Boss #Siri #Umadevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు