తెలుగు హీరోలు ఏదో విషయంలో ఇరుక్కోవడం మనం చూస్తుంటాం.కానీ పీకల వరకు తాగి పోలీసులకు చిక్కిన హీరోల సంఖ్య చాలా తక్కువ.
అలాంటి కోవలోకి తాజాగా ఓ యంగ్ హీరో చేరాడు.బిగ్బాస్ లాంటి బిగ్ షోలో పాల్గొన్న ఆ యంగ్ హీరో తాజాగా తప్పతాగి పోలీసులకు చిక్కిన వైనం వెలుగు చూసింది.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో తాజాగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు మందుబాబుల పనిపడుతోండగా తెలుగు హీరో ప్రిన్స్ వారికి చిక్కాడు.ఫుల్లుగా మందు తాగి పోలీసులకు చిక్కాడు ఈ హీరోగారు.
మత్తులో తన వాహనం నడుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు.దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
కాగా కోర్టు అతడికి జరిమానా విధించింది.అతడు మీడియా కంట పడకుండా ఉండేందకు జాగ్రత్తలు తీసుకున్నా తెలుగు మీడియా మూడోకన్నుతో అతడి యవ్వారాన్ని బట్టబయలు చేసింది.ఏదేమైనా బిగ్బాస్ సీజన్1తో ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రిన్స్ ఇలా ఫుల్లుగా తాగి బుక్కవుతాడని ఎవరూ ఊహించలేదు.దీంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.