బిగ్ బాస్ సీజన్ 2 హిట్టా.? ఫట్టా.? మొదటి సీజన్ తో పోలుస్తూ ఆడియన్స్ ఏమంటున్నారంటే?     2018-06-12   06:43:08  IST  Raghu V

ఎన్నో విమర్శల నడుమ మొదలై ,అత్యధిక టిఆర్పీ తో దూసుకుపోతూ విజయవంతంగా ముగిసింది బిగ్ బాస్ మొదటి సెవన్. ఎన్టీఆర్ మన ఇంటి కుర్రాడిలా కలిసిపోయాడు అని ఎంతో ప్రశంశలు అందించారు. ఇప్పుడు రెండో సెవన్ మొదలయ్యింది. మరింత మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్నారు. మొదటి రోజు అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ షో. ముఖ్యంగా కంటెస్టెంట్స్ చాలా మందికి తెలియకపోవడం పెద్ద మైనస్ అయ్యింది.

“బిగ్ బాస్ 2” షోను నాని హోస్ట్ చేసిన విధానం చాలా పేలవంగా ఉందని, ఎన్టీయార్ లో కనీసం సగం కూడా నాని చేయలేకపోయాడు. ముఖ్యంగా ఏ ఒక్క కంటెస్టెంట్ తోనూ సరిగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు అలాగే.. ఆడియన్స్ ను కూడా ఎంగేజ్ చేయలేకపోయాడు. నాని హోస్టింగ్ కంటే కంటెస్టెంట్స్ ఆడియో విజువల్స్ బాగున్నాయని మీమ్స్ వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు.