ఏమున్నాడే మహేష్ అనుకున్నాం.. బిగ్ బాస్ దివి కామెంట్స్..!

బిగ్ బాస్ కు వెళ్లకముందు పెద్దగా ఎవరికి తెలియని మోడల్ కమ్ యాక్ట్రెస్ దివి బిగ్ బాస్ సీజన్ 4 లో క్రేజీ కంటెస్టంట్ గా మారాక పాపులారిటీ పెరిగింది.సినిమా ఆఫర్లతో పాటుగా ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా పెరిగింది.

 Biggboss Divi Comments On Superstar Mahesh , Bigboss Divi, Divi Vadhya, Mahesh B-TeluguStop.com

ఈ క్రమంలో ఆమెకు వచ్చిన ఈ ఐడెంటిటీని ఫుల్లుగా వాడేస్తుంది అమ్మడు.ప్రస్తుతం ఛాన్సులు వస్తున్నా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా టార్గెట్ గట్టిగా ఫిక్స్ చేసుకున్న దివి బిగ్ బాస్ కి వెళ్లకముందు తను చేసిన ఒకటి రెండు సినిమాల ప్రస్థావన తీసుకొచ్చింది.

ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో సినిమా అవకాశాల గురించి మాట్లాడిన దివి ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయని చెప్పింది.

తన మొదటి సినిమానే మహేష్ బాబు మహర్షి సినిమా అని.ఆ సినిమాలో మహేష్ తో నటించానని.సినిమాలో తనతో మహేష్ బాబువి రెండు సీన్స్ ఉన్నా అవి కట్ చేశారని.

అందుకే మహర్షిలో మహేష్ వెనక గ్యాంగ్ లో తను కనిపిస్తానని అన్నారు దివి.ఇక ఆ షూటింగ్ టైం లో మహేష్ ని చూసి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ అబ్బా ఏమున్నాడే అని అనుకునే వాళ్లమని.

ఆయన ఛార్మింగ్, లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయ్యామని అన్నారు దివి.మొదటి సినిమా మహేష్ తోనే కాబట్టి ఆయనే తన ఫేవరెట్ హీరో అనేస్తుంది దివి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube