బిగ్ బాస్ లో భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు..! అతను అమ్మాయిల మీద చేతులేస్తాడు.. నాకు నచ్చలే!       2018-06-19   00:08:11  IST  Raghu V

బిగ్ బాస్ 2 సీజన్ మొదలయ్యి అప్పుడే వారం రోజులు దాటింది. మొదటి ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇక రెండో వారిని ఎలిమినేట్ చేసే పనిలో పడ్డారు అందరు. హౌజ్‌మేట్స్ అందరూ ఎలిమినేషన్ కోసం పేర్లను నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. అయితే హౌజ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సామ్రాట్‌‌ను ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ తప్పించారు. ఆయన పేరును ఎవరూ నామినేట్ చేయకూడదని ఆదేశించారు. అయితే ఒక హౌజ్‌మేట్ పేరును కెప్టెన్ అందరి ముందు సూచించాలని బిగ్ బాస్ చెప్పడంతో.. దీప్తి సునైనా పేరును సామ్రాట్ నామినేట్ చేశారు. కెప్టెన్ నామినేట్ చేసిన దీప్తి పేరును కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లే హౌజ్‌మేట్స్ ఎవరూ మళ్లీ నామినేట్ చేయడానికి వీళ్లేదని బిగ్ బాస్ స్పష్టం చేశారు.

ఎలిమినేషన్‌కు గణేష్, నూతన్ నాయుడు, కౌశల్, బాబు గోగినేని పేర్లను ఎక్కవ మంది నామినేట్ చేశారు. ఇక దీప్తి సునైనాను కెప్టెన్ సామ్రాట్ ఎలాగూ నామినేట్ చేశారు కాబట్టి ఆమె పేరును కూడా బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో చేర్చారు. అయితే హౌజ్‌మేట్స్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్ సమయంలో కన్ఫెషన్ రూమ్‌లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కౌశల్‌పై భానుశ్రీ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరం.

-

కౌశల్ అమ్మాయిలపై చేతులు వేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. అమ్మాయిలను టచ్ చేయకుండా మాట్లాడడు. చేయివేసినప్పుడు.. ఏయ్ చేయ్ తియ్ అని చెప్పడం బాగోదు కాబట్టి అనడం లేదు. అందుకే అతని పేరును నామినేట్ చేస్తున్నాను’ అంటూ భానుశ్రీ మండిపడింది. ఇక దీప్తి సునైనా కూడా కౌశల్ పేరును నామినేట్ చేసింది. తను పిల్లి వేషం వేసినప్పుడు కౌశల్ తనను చేతులపై ఎత్తుకెళ్లాడని, అది తనకు నచ్చలేదని చెప్పింది. తన సొంత అన్నయ్య అయినా కూడా అలా చేయనివ్వనని తేల్చి చెప్పింది. మిగిలినవారంతా సాధారణ కారణాలతోనే హౌజ్‌మేట్స్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు.