తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో 10 వ వారం నామినేషన్స్ రచ్చ అప్పుడే షురూ అయ్యింది.నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ఒకరీ తప్పులను మరొకరు బయట పెడుతూ ఒకరి పై ఒకరు మాటలతో విరుచుకు పడ్డారు.
తాజాగా శ్రీసత్య, రాజ్, రోహిత్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.కెప్టెన్ శ్రీసత్య తో నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు.
కాగా ఈ నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు ఇనయాకు పడ్డాయి.ఏకంగా 8 మంది ఆమెను నామినేట్ చేశారు.
ఆ తర్వాత వాసంతి రేవంత్ నామినేట్ చేయడానికి రేవంత్ చెప్పిన రీజన్ తనకు నచ్చలేదు అని వాసంతి వాదనకు దిగింది.నేను అగ్రెసివ్ అని నన్ను రెండు వారాలు నామినేట్ చేశారు అని రేవంత్ అనగా వెంటనే వాసంతి అది అందరూ చెప్పేదే నేను కొత్తగా చెప్పేదేముంది అని అంటుంది.
అప్పుడు రేవంత్ కావాలని ఒక వ్యక్తి మీద చెయ్యి వ్యక్తి కొట్టడం తప్పు.అక్కడ నేను హర్ట్ అయ్యాను తగిలింది చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అనేది అవసరం కానీ కొట్టాలని ఇంటెన్షన్ రాంగ్ అని అంటాడు.
ఆ కారణంతోనే నామినేట్ చేస్తున్నాను అని రేవంత్ అనడంతో.ఇంటెన్షన్ తో నుంచి కొట్టలేదు అంటూ వాసంతి రేవంత్ తో వాదించింది.అప్పుడు వాసంతి ప్రతిసారీ మీరు అందర్నీ గేమ్ లో తోసేయడం లేదా అని అనగా అయితే వాళ్ళ నాకు అడ్డు రావద్దని చెప్పండి అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు రేవంత్.మీకు ఎవరు అడ్డు రాకపోతే మీరు ఒక్కరే ఆడుకోండి అనగా వేరే వాళ్లతో గేమ్ ఆడాలా లేదా అన్నది బిగ్ బాస్ నిర్ణయిస్తారు నువ్వు కాదు అని అంటాడు రేవంత్.
మీకు ముందుకొచ్చి ఆగడానికి భయం వినకుండే ఆడటానికి ధైర్యం లేదు వేరే వాళ్లతో ట్రై చేస్తారు.
అనగా వెంటనే రేవంత్ కనీసం మీరు అది కూడా ట్రై చేయలేదు అనటంతో వేరే వాళ్ళని తోసేసి ఆడటం నాకు తెలియదు నీలాగా ఒకరిని తోసేసి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను గేమ్ గెలిస్తే చాలు అనుకునేది నువ్వు నీకన్నా నేను చాలా బెటర్ అని అంటుంది వాసంతి.ఇక చాలు వెళ్ళు అంటూ వాసంతి అనడంతో అప్పటివరకు మీరు అని మాట్లాడిన వాసంతి నువ్వు అనే మాట్లాడడంతో రేవంత్ కి కోపం వచ్చి వెళ్ళు అంటే వెళ్లిపోను వేరే వాళ్ళ నేను చూస్తూ ఊరుకోను నాతో మాట్లాడేటప్పుడు అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి అని రేవంత్ అంటాడు.అప్పుడు వాసన ది కూడా నువ్వు కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని నాతో మాట్లాడు అని అంటుంది.
అప్పుడు రేవంత్ ఒళ్ళు గురించి నేను మాట్లాడలేదు నోరు జారింది మీరు అంటూ వాసంతికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు రేవంత్.