బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ మానస్ తప్ప మిగిలిన ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు.అయితే ఈ వారం నామినేషన్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉన్నారని చెప్పొచ్చు.
సన్నీ, కాజల్, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర, రవి, సిరితో పాటుగా ప్రియాంకా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంది.అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో లీస్ట్ లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
అందులో ఒకరు ప్రియాంకా కాగా.మరొకరు సిరి అని తెలుస్తుంది.
వీరి తర్వాత స్థానంలో రవి ఉన్నాడు.సిరి, ప్రియాంకా ఈ ఇద్దరిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ అన్ అఫీషియల్ పోల్స్ లో ఈ వారం ప్రియాంకా సింగ్ హౌజ్ నుండి బయటకు రావడం పక్కా అని చెప్పేస్తున్నాయి.అయితే వీకెండ్ కల్లా ఏదైనా జరగొచ్చు కాబట్టి ఈ వారం ఎవరు బయటకు వస్తారో చూడాలి.
ఈ వారం నామినేషన్స్ ఇలా ఉంటే వచ్చే వారం కచ్చితంగా మరింత టఫ్ నామినేషన్స్ ఉంటాయని చెప్పొచ్చు.