బిగ్ బాస్ హౌజ్ లో ఉమాదేవి రచ్చ..!

బిగ్ బాస్ సీజన్ 5లో సీరియల్ యాక్టర్ ఉమాదేవి రచ్చ మొదలైంది.మొదటి వారం లోనే హౌజ్ లో కొందరితో తన ఎటాకింగ్ మోడ్ తో అందరిని టార్గెట్ చేస్తుంది ఉమాదేవి.

 Biggboss 5 Umadevi Fight With Housemates , Big Boss 5, Big Boss Telugu , Big Bos-TeluguStop.com

సీరియల్ లో గడసరి అత్త పాత్రలో నటించే ఉమాదేవి అదే తరహాలో హౌజ్ లో కూడా తన ప్రతాపం చూపిస్తుంది.బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పటికే ప్రియ, అనీ మాస్టర్ ఇద్దరు మధ్య వయసు గల మహిళలు ఉండగా ఉమాదేవి కూడా వారికి తగిన పోటీ ఇస్తుంది.

ప్రియ, అనీ సైలెంట్ గా వారి పనులు చేసుకుంటుండగా ఉమాదేవి మాత్రం ప్రతి చిన్న విషయాన్ని నానా రభస చేస్తుంది.ఇప్పటికే ఆమె చేసిన ఆలూ కర్రీ గొడవ హాట్ న్యూస్ గా మారగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్ ఎంపికలో జెస్సీ తర్వాత వరస్ట్ పర్ఫార్మర్ గా హయ్యెస్ట్ ఓట్స్ ఆమెకే వచ్చాయి.

హౌజ్ లో తనని టార్గెట్ చేస్తున్న వారిని ఉమాదేవి దృష్టిలో పెట్టుకుందని చెప్పొచ్చు.సీరియల్ లో తన నెగటివ్ యాంగిల్ ను బిగ్ బాస్ హౌజ్ లో కూడా కొనసాగిస్తుంది ఉమాదేవి.

ముఖ్యంగా ఆమె మాట తీరు వల్ల హౌజ్ లో ఉన్న చాలామంది అసంతృప్తిగా ఉన్నారు.శుక్రవారం ఎపిసోడ్ లో ప్రియాంకా సింగ్ తో ఉమాదేవి గొడవ హాట్ న్యూస్ అయ్యింది.

ఇద్దరిలో తప్పెవరిది అన్నది శనివారం నాగార్జున తేల్చాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube