బిగ్ బాస్ 5 : సన్నీ ఎంటర్టైన్ స్టార్ ఆఫ్ ది హౌజ్..!

బిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన విజే సన్నీ ఎలాంటి టాస్క్ వచ్చినా తనదైన శైళిలో ఆడుతూ మెప్పిస్తున్నాడు.మొన్నటిదాకా బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ కు కోపం తో ఊగిపోయిన సన్నీ హోస్ట్ నాగార్జున సలహా మేరకు పూర్తిగా మారిపోయాడు.

 Biggboss 5 Sunny Entertainar Of The Biggboss House , Bigboss5 , Bigboss House, B-TeluguStop.com

హౌజ్ లో ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్న సన్నీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కూడా మంచి ఫన్ జెనరేట్ చేస్తున్నాడు.బుధవారం ఎపిసోడ్ లో పేస్ట్రీ కేక్ తిని నానా అల్లరి చేసిన సన్నీ.

లేటెస్ట్ గా జరుగుతున్న బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో ఊరు నుండి మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన పాత్రలో మెప్పిస్తున్నాడు.

ఓ విధంగా చెప్పాలంటే ఈ టాస్క్ లో సన్నీ తన కామెడీ సైడ్ మొత్తం పెట్టేస్తున్నాడని చెప్పొచ్చు.

టాస్క్ పర్ఫెక్ట్ గా చేయడమే కాకుండా హౌజ్ మొత్తం ఎంటర్టైన్ అయ్యేలా చేస్తున్నాడు.ఈ స్పీడ్ చూస్తుంటే ఈసారి కెప్టెన్సీ కంటెండర్ గా సన్నీ ఖచ్చితంగా ఉండేలా కనిపిస్తున్నాడు.

అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచే టాప్ 3 లో కూడా సన్నీ ఒకడిగా ముందు వరుసలో ఉంటున్నాడు.తప్పకుండా సన్నీ ఆట తీరు బిగ్ బాస్ ఆడియెన్స్ ను బాగా మెప్పిస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube