బిగ్ బాస్ 5 : మళ్లీ దొరికిపోయిన రవి..!

Biggboss 5 Ravi Again Flip Siri Stickers Issue 5

బిగ్ బాస్ సీజన్ 5 లో వన్ ఆఫ్ ది స్టార్ కంటెస్టంట్ గా వచ్చాడు యాంకర్ రవి.బయట అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా హౌజ్ లో అతను బాగా ఆడి మరింత క్రేజ్ తెచ్చుకుంటాడు అనుకుంటే అతను మాత్రం హౌజ్ లో చేస్తున్న పనుల వల్ల ఉన్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యేలా ఉంది.

 Biggboss 5 Ravi Again Flip Siri Stickers Issue 5-TeluguStop.com

బిగ్ బాస్ హౌజ్ లో తన స్టాటజీ అనుకుంటున్నాడో లేక పొరబడుతున్నాడో గాని రవి మాత్రం ప్రతి వారం ఏదో ఒక విషయంలో హోస్ట్ నాగార్జునకు దొరికిపోతూనే ఉన్నాడు.లహరి, ప్రియ విషయంలో అడ్డంగా బుక్ అయిన రవి ఆ తర్వాత శ్వేత విషయంలో కూడా మాట మార్చాడు.

టాస్క్ లో భాగంగా కుషన్ ను చించే విషయం శ్వేతకు తెలియదని రవి వాదించగా అతనికి తెలుసని శ్వేత చెప్పింది.అయితే ఆమె లాస్ట్ వీక్ హౌజ్ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఈ వారం రవిని నామినేట్ చేసే అవకాశం లేకుండాపోయింది.

 Biggboss 5 Ravi Again Flip Siri Stickers Issue 5-బిగ్ బాస్ 5 : మళ్లీ దొరికిపోయిన రవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా సరే ప్రియ వల్ల ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు రవి.

ఇక ఇదిలాఉంటే ప్రభావతి టాస్క్ లో సిరి స్టిక్కర్స్ ను రవి కావాలని దాచిపెట్టి ఆ తర్వాత ఆమెకు ఎవరో పెట్టారన్నట్టు గెస్ చేసి అవి ఉన్న అడ్రెస్ చెబుతాడు.అయితే ఈ విషయంలో సిరి రవిని నువ్వే తీశావా అని అడిగితే లేదు కాదు అని సమాధానం ఇచ్చాడు.అయితే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున రవి సిరి స్టిక్కర్స్ తీశావా అంటే నాకు దొరికాయని మళ్లీ మాట మారుస్తాడు.

దొరికితే ఆమెకు ఇవ్వొచ్చు.ఒకవేళ కావాలని దాచిపెట్టినా ఆమెకి ఎవరో అక్కడ పెట్టారు అన్నట్టు చెప్పాడు.

సో ఈ విషయంలో రవి మళ్లీ నాగార్జునతో పాటుగా హౌజ్ మెట్స్ కు దొరికిపోయాడు.మరి తన ఆట తీరే ఇది అని ప్రూవ్ చేస్తున్నాడా లేక తను చేసే ప్లాన్లు వర్క్ అవుట్ కావట్లేదా తెలియదు కాని రవి మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో బాగా ఇరుకున పడుతున్నాడని చెప్పొచ్చు.

#Ravi #Siri BiggBoss #Siri BiggBoss #BiggBoss Ravi #Anchor Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube