బిగ్ బాస్ సీజన్ 5లో 9వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప అందరు నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే.హౌజ్ లో షణ్ముఖ్ తో కలిపి 11 మంది ఉండగా అతను కాకుండా ఈ వారం అందరు నామినేషన్స్ లో ఉన్నారు.
అయితే నామినేట్ అయితే అయ్యారు కాని ఈ నామినేషన్స్ నుండి ఇద్దరు తప్పించుకున్నారని తెలుస్తుంది.లాస్ట్ వీక్ నాగార్జున వచ్చినప్పుడు అనీ మాస్టర్ ఓ పవర్ గెలుచుకున్నారు.
ఆ పవర్ ఉపయోగించుకుని ఈ వారం నామినేషన్స్ నుండి ఆమె సేఫ్ అవుతున్నారని తెలుస్తుంది.
ఆమె మాత్రమే కాదు ఈ వారం ఆమె మరొక హౌజ్ మెట్ ను తన పవర్ తో సేఫ్ చేసిందని తెలుస్తుంది.
అనీ మాస్టర్ తన పవర్ తో తనతో పాటుగా మానస్ ను నామినేషన్స్ నుండి సేఫ్ చేసినట్టు తెలుస్తుంది.మరి అనీల్ మాస్టర్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో కాని ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన మానస్ ను ఆమె ఎందుకు సేఫ్ చేసిందో తెలియాల్సి ఉంది.
అనీ మాస్టర్ తన పవర్ తో ప్రియాంకా, కాజల్ లో ఒకరిని సేఫ్ చేస్తారని అనుకున్నారు.కాని మానస్ ను సేఫ్ చేసి షాక్ ఇచ్చింది.