బిగ్ బాస్ సీజన్ 5 లో నాలుగవ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా ఫైనల్ గా నటరాజ్ మాస్టర్ హౌజ్ నుండి బయటకు వచ్చాడు.
ఈ క్రమంలో వెళ్తూ వెళ్తూ హౌజ్ మెట్స్ ను జంతువులతో పోల్చుతూ నటరాజ్ మాస్టర్ షాక్ ఇచ్చాడు.ముఖ్యంగా హౌజ్ లో గుంటనక్క ఉందంటూ నాగార్జునని సైతం నమ్మించిన నటరాజ్ మాస్టర్ ఆ గుంటనక్క ఎవరన్నది రివీల్ చేశాడు.
గుంటనక్క మాత్రమే కాదు మొసలి, గాడిద, ఊసరవల్లి ఇలా అన్ని జంతువులను హౌజ్ మెట్స్ తో పోల్చుతూ కామెంట్స్ చేశాడు.ఊసరవల్లిగా విశ్వని సెలెక్ట్ చేసిన నటరాజ్ మాస్టర్, మొసలిగా శ్రీరాం ను ఎంపిక చేశాడు.
ఇక గాడిదగా మానస్ ను సెలెక్ట్ చేయగా.ఫైనల్ గా గుంటనక్కగా రవిని ఎంపిక చేశాడు.
పాముగా సిరిని.రామచిలక్గా ప్రియాంకాని ఎంపిక చేశాడు.
మొత్తానికి వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులను జంతువులతో పోల్చుతూ నటరాజ్ మాస్టర్ తన అభిప్రాయాలను తెలిపాడు. అయితే వెళ్తున్నాడు కాబట్టి నటరాజ్ మాస్టర్ చెప్పిన జంతువులను హౌజ్ మెట్స్ కూడా చాలా లైట్ తీసుకున్నారు.