బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరంటే..!

బిగ్ బాస్ 5 నాల్గవ వారం నామినేషన్స్ లో హయ్యెస్ట్ గా ఎనిమిది మంది హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.ఈ వారం నామినేషన్స్ లో రవి, లోబో, సిరి, ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, కాజల్, సన్నీ ఉన్నారు.

 Biggboss 5 Elimination Chances-TeluguStop.com

అయితే నామినేట్ అయిన ఎనిమిది మంది హౌజ్ మెట్స్ లో ఐదుగురు కచ్చితంగా సేఫ్ అవుతారు.ఎటొచ్చి రిస్క్ లో పడేది కేవలం ముగ్గురు హౌజ్ మెట్స్ మాత్రమే అని చెప్పొచ్చు.

నామినేట్ అయిన ఎనిమిది మంది హౌజ్ మెట్స్ లో నటరాజ్, లోబో, అనీ మాస్టర్ మాత్రమే రిస్క్ లో పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 Biggboss 5 Elimination Chances-బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటరాజ్ మాస్టర్ కిచెన్ లో తను అందరికి హెల్ప్ చేస్తున్నా.

కొన్ని విషయాల్లో అతను చేస్తున్న ఎటాకింగ్ మోడ్ హౌజ్ మెట్స్ కు మాత్రమే కాదు.ఆడియెన్స్ కు ఇబ్బందిగా ఉంది.

ఈరోజు నామినేషన్స్ లో పులితో వేట నాతో ఆట డైలాగ్.మీసం తిప్పడం లాంటివి ఓవరాక్షన్ లా అనిపించింది.

ఇక లోబో కూడా ప్రియ మీద ఎక్కువగా అరిచాడని అనిపిస్తుంది.తను చెప్పాలనుకున్నది చెప్పి ఉంటే బాగుండేది.

ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె పోడియం దగ్గరకు వెళ్లి అరవడం ఏమాత్రం కరెక్ట్ గా అనిపించలేదు.సో నటరాజ్ మాస్టర్, లోబో వీరిద్దరిలో కచ్చితంగా ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక థర్డ్ ఛాన్స్ అనీ మాస్టర్ కూడా మాట్లాడితే హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ను టార్గెట్ చేస్తుంది.అందుకే ఆమె కూడా ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

#Bigg Boss #BiggBoss Guess #Nagarjuna #Maa #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు