Bigg Boss6 Telugu : పాపం.. ఈ వారం శ్రీసత్య కోసం ఆ మోడల్ ఔట్.. నెటిజన్స్ ట్రోల్స్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే 12 వారం ముగింపు దశకు చేరుకుంది.హౌస్ లో ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

 Bigg Boss6 Model Rajasekhar Eliminated From House,bigg Boss6,nagarjuna,rajasekha-TeluguStop.com

రేవంత్ కీర్తి మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్ ప్రక్రియలో ఉన్న విషయం తెలిసిందే.కాగా నామినేషన్స్ లో రేవంత్ లేకపోవడంతో వినయకు భారీగా ఓట్లు పడినట్టు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం చివరి రెండు స్థానాలలో రాజ్, ఫైమా లు ఉన్నారు.అయితే వీరిద్దరిలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కానీ ఫైమా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆమె దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది.ఫ్రీ పాస్ ఉపయోగించి ఫైమా సేవ్ అయితే ఇక రాజ్ ఎలిమినేట్ తప్పకుండా అవుతాడు అని చెప్పవచ్చు.12 వారం ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇక 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈవారం శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమెకు ఓట్లు బాగానే పడటంతో ఈ వారం కూడా శ్రీ సత్య సేఫ్ అయినట్లు తెలుస్తోంది.

కానీ ఒక వర్గం ప్రేక్షకులు ప్రతి వారం లాగే ఈ వారం కూడా బిగ్బాస్ శ్రీ సత్యని సేవ్ చేసి అన్యాయంగా రాజ్ ని ఎలిమినేట్ చేసాడని ఆరోపిస్తున్నారు.

Telugu Bigg Boss, Faima, Inaya, Nagarjuna, Rajasekhar, Sri Satya-Movie

ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా రాజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.రాజ్ హౌస్ లో మాట్లాడేది తక్కువే అయినప్పటికీ కరెక్ట్ గా మాట్లాడతాడని బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు నాగార్జున కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే.హౌస్ లోకి ఇచ్చిన మొదట్లో సైలెంట్ గా ఉండే రాజ్ ఆ తర్వాత తన ఆట తీరు మాట తీరును మార్చుకున్నాడు.

ఇకపోతే గతవారం చెక్ అమౌంట్ టాస్క్ లో కూడా తన తెలివిని ఉపయోగించి నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.మరి నిజంగానే రాజ్ ఎలిమినేట్ అయ్యాడా లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube