గత ఏడాది జరిగన బిగ్ బాస్ సీజన్4 రియాలిటీ షో విజేతగా నిలిచిన టైటిల్ ను సొంతం చేసుకున్నారు అభిజిత్.స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన అభిజిత్ ఎంతో చాకచక్యంగా టాస్క్ లను పూర్తి చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు.11 సార్లు ఎలిమినేషన్ కి వెళ్ళిన అభిజిత్ చివరి నిమిషంలో అభిమానుల ఓట్ల ద్వారా చివరి వరకు హౌస్ లో ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి చివరికి విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.అయితే బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత అభిజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
ప్రస్తుతం అభిజిత్ కోసం కొంత మంది దర్శకులు స్క్రిప్టులను తయారు చేసే పనిలో పడ్డారు.బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న అభిజిత్ ఎలాంటి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.కాగా బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే అభిజిత్ చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో అభిజిత్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంది.
ఆ ఫోటోలో ఎంతో అమాయకంగా చూస్తున్న అభిజిత్ ఆ ఫోటో కి మామ్ లవ్ అని కామెంట్ కూడా జత చేశాడు.బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కేవలం అభిజిత్ మాత్రమే కాకుండా తన తల్లి కూడా ఎంతో ఫేమస్ అయ్యారు.ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు క్యూట్ అంటూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ తన జెర్సీని అభికి గిఫ్ట్ గా పంపిన సంగతి మనకు తెలిసినదే.దాన్ని కూడా అభిజిత్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం అభిజిత్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.