తెలుగు బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిబి హోటల్ టాస్క్ ఇచ్చారు.ఇంటి సభ్యులు ఈ టాస్క్ కోసం హోటల్ సిబ్బంది మరియు హోటల్ అతిధులు అంటూ రెండు టీంలు విడి పోయాయి.
ఈ రెండు టీములు కూడా వారి విధులను సక్రమంగా నిర్వహించాలంటూ బిగ్ బాస్ సూచించారు.అతిధులకు బిబి హోటల్ సిబ్బంది కావాల్సిన అతిధి సత్కారాలను అందించాల్సి ఉంటుంది.
అలా పొంది మర్యాదలకు గాను తర్వాత టిప్పు ఇవ్వాలని లేదా స్టార్ కూడా ఇవ్వాలని బిగ్ బాస్ సూచించాడు.హోటల్ సిబ్బంది అతిధుల పట్ల మర్యాదగా వ్యవహరించాలంటూ బిగ్ బాస్ ముందుగానే సూచించడం జరిగింది.
ఇదే సమయంలో అవినాష్ కు సీక్రెట్ టాస్క్ ఇచ్చి అతిథులను ఇరిటేట్ చేయాల్సిందిగా సూచించాడు.అరియానా టాస్క్ లో భాగంగా ప్రిన్సెస్ గా మారింది.
ఆమెను అవినాష్ పదేపదే విసిగిస్తూ ఉండడం వల్ల ఆమె తాను ప్రిన్సెస్ ను నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నావ్ అంటూ అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.నీవు నాకు దూరంగా ఉండు అంటూ అరియానా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నువ్వు టాస్క్ లో ప్రిన్సెస్ నిజంగా కాదు మరీ అంతలా జీవించేయకు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంటి సభ్యులు అంతా కూడా వారి వారి పాత్రల్లో జీవించి చేస్తున్నారు.
ముఖ్యంగా అరియానా ఎక్కువగా జీవించేస్తుంది అంటూ కొందరు కామెడీ చేస్తున్నారు.గంగవ్వ రాణి పాత్రలో కనిపించింది.
ఇక హారిక సోహెల్ మరియు మెహబూబ్ డబ్బున్న వారిగా బిగ్ బాస్ హోటల్లో గెస్ట్ లుగా ప్రవేశించారు.వారికి నేడు జరగబోయే అతిధి సత్కారాలు ఏంటి నేడు ఎలాంటి మలుపులు తిరుగుతుంది గేమ్ అనేది వేచి చూడాలి.
ఈ వారంలో అవినాష్ తీసుకున్న సీక్రెట్ టాస్క్ లో విన్నర్ అయితే కెప్టెన్సీ కి పోటీ దారుడిగా నిలుస్తాడు.