బిగ్ బాస్ విన్నర్... కోటీశ్వరుడైన సన్నీ.. అసలు ఎంత సంపాదించాడంటే?

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు దాదాపు మూడు నెలల పాటు కుటుంబ సభ్యులతో ఏమాత్రం సంబంధం లేకుండా, ఎలాంటి ఫోన్ లేకుండా కేవలం నాలుగు గోడల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లతో మానసికంగా, శారీరకంగా యుద్ధం చేస్తూ ప్రేక్షకులను సందడి చేయాలంటే ఎంతో కష్టతరమైన పని అని చెప్పాలి.

 Bigg Boss Winner Become Billionaire Sunny How Much Money Does He Really Earned,-TeluguStop.com

ఇలా ఈ విధమైనటువంటి కష్టాలు అన్నింటిని ఎదుర్కొంటూ బిగ్ బాస్ విజేతగా నిలవడం అదొక మధురమైన అనుభూతి అని చెప్పాలి.ప్రస్తుతం అలాంటి అనుభూతిని పొందుతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ సన్నీ.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సన్నీ తనదైన శైలిలో ఈ కార్యక్రమంలో పాల్గొని విశేష ప్రేక్షకాదరణ పొందారు.హౌస్ లోకి వెళ్ళిన అప్పటినుంచి సన్నీ బిగ్ బాస్ టైటిల్ టార్గెట్ చేస్తూ… ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి స్ట్రాంగ్ పోటీ ఇస్తూ.

చివరికి బిగ్ బాస్ విజేతగా నిలబడ్డారు.కేవలం తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా తన తల్లి కోరిక నెరవేర్చాలన్న సన్నీ పట్టుదల ఆయననే విజేతగా నిలబెట్టింది.

బిగ్ బాస్ టైటిల్ రేసులో లేనటువంటి సన్నీ అనూహ్యంగా పలు టాస్క్ లలో అందరి దృష్టిని ఆకర్షించి రోజురోజుకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఈ విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సన్నీ టాప్ ఫైవ్ గా నిలబడి చివరికి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు.బిగ్ బాస్ విజేతగా నాగార్జున సన్నీని ప్రకటించడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇలా తను అనుకున్న టార్గెట్ చేరడంతో సన్నీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచిన సన్నీ ఎంతవరకు సంపాదించారు అనే విషయానికి వస్తే.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లిన సన్నీ విజేతగా నిలవడంతో అతనికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ అందించారు.ఈ ప్రైజ్ మనీతో పాటు సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు ముందుగా చెప్పిన ప్రకారం 25 లక్షల విలువచేసే 300 చదరపు అడుగుల భూమిని బహుకరించారు.ఈ స్థలం షాద్ నగర్ లో కేటాయించారు.

ఈ బహుమతులతో పాటు టీవీఎస్ కంపెనీ తరఫున ఒక బైక్ అందించారు.దీని ధర మార్కెట్లో సుమారు లక్షన్నర వరకు ఉంది.

వీటితో పాటు 15 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో సన్నీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసినందుకుగాను అతనికి సుమారు 20 నుంచి 25 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం.మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచిన సన్నీ ఏకంగా కోటి రూపాయలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్లో విజేతగా నిలబడిన సన్నీ తనకు మద్దతు తెలుపుతూ తనగెలుపు కు సహకరించిన ప్రతి ఒక్క అభిమానికి, ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Bigg Boss5 Winner Sunny Became Billionaire

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube