మూడు కథలు ఫైనల్ చేశా అంటున్న బిగ్ బాస్ విన్నర్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా తెలుగులో తెరంగేట్రం చేసిన కుర్రాడు అభిజిత్.మొదటి సినిమాతోనే నటుడుగా మంచి మార్కులు వేసుకున్న ఈ కుర్ర హీరో తరువాత మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమా చేశాడు.ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.తరువాత సినిమాలు చేసే అవకాశం రాలేదు.అయితే పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ తో కొంత వరకు బాగానే పాపులర్ అయ్యాడు.ఆ పాపులారిటీ ఉపయోగించుకొని అభిజిత్ బిగ్ బాస్ సీజర్ 4లోకి ఎంట్రీ ఇచ్చాడు.

 Bigg Boss Winner Abhijit Finalized 3 Movie Projects, Tollywood, Telugu Cinema, S-TeluguStop.com

మొదటి నుంచి ఈ సీజర్ లో చాలా క్లారిటీగా ఉంటూ గేమ్ ఆడుతూ అభిజిత్ అందరి అభిమానం సొంతం చేసుకున్నాడు.అదే సమయంలో సెలబ్రెటీలు కూడా అభిజిత్ విన్నర్ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఈ నేపధ్యంలో ఆయా సెలబ్రెటీల ఫ్యాన్స్ అందరూ అభిజిత్ కి మద్దతుగా నిలబడ్డారు.దీంతో అతను ఫైనల్ విన్నర్ అయ్యారు.

అయితే హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ప్రతి ఈ సీజన్ లో పాల్గొన్న దివి, మెహబూబా, అవినాష్, సోహైల్, మోనాల్ లకి మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు కూడా బాగా వచ్చాయి.

నెంబర్ 2గా నిలిచినా అఖిల్ కంటే వారికి ఎక్కువ ఫేమ్ వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక అఖిల్ సైలెంట్ అయిపోయాడు.అభిజిత్ ఇంటర్వ్యూలు ఇస్తున్న అతని ఫేమ్ కి తగ్గ ఐడెంటిటీ రాలేదని టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం మూడు సినిమా కథలు ఫైనల్ చేశానని, వాటిలో ఏది ముందు స్టార్ట్ చేయాలనే విషయంలో కాస్తా కన్ఫ్యూజన్ ఉందని తెలిపారు.

త్వరలో తన సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఫేమ్ తో ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube