ప్రియాంకకు నో రీజన్స్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్?

బిగ్ బాస్ షో చూస్తుండగానే 12 వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని 13వ వారం లోకి అడుగుపెట్టింది.13వ వారంలోకి వచ్చాక సేఫ్ ఆడటానికి లేదు, అలాగే గుంపులో గోవిందా అనే టైపులో ఉంటే కుదరదు.ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు.కంటెస్టెంట్ లు తక్కువగా ఉండటంతో ఈ 13వ వారం లో నామినేషన్ ప్రక్రియ వేడెక్కేలా కనిపిస్తోంది.

 Bigg Boss Warns Priyanka Singh In 13th Week Nomination In Bigg Boss 5 Telugu , P-TeluguStop.com

అందులో కాజల్, మానస్, సన్నీ, ప్రియాంక లు ఒక గ్రూప్.

వీరిలో ఏ ఒక్కరూ మిగతా ముగ్గురిని నామినేట్ చేసుకోరు.

ఇక 13వ వారంలో కూడా పింకీ సేఫ్ గేమ్ ఆడాలని చూస్తోంది.నాకు నామినేషన్ చేసేందుకు ఎవరికీ ఏ కారణం కూడా లేదని ప్రియాంక అంటోంది.

అలా కుదరదు ఖచ్చితంగా కారణాలు చెప్పాలి నామినేట్ చేయాలి అంటూ కెప్టెన్ షణ్ముఖ్ ఆదేశించాడు.నామినేట్ చేసే ఛాన్స్ ఉంటే నిన్నే చేసేదాన్ని అంటూ ప్రియాంక కాస్త అతి చేసింది.

Telugu Priyanka Singh-Movie

షణ్ముఖ్ ఎంత చెప్పినా కూడా ప్రియాంక నామినేట్ చేసేందుకు ఎటువంటి కారణాలు లేవంటూ పదేపదే అదే మాట చెబుతోంది.ఇక అప్పుడు సన్నీ, ప్రియాంకకు హింట్లు ఇచ్చాడు.మానస్ మాట్లాడటం లేదని, కాజల్ మొహం కడుక్కోవడం లేదని చెప్పు అని అంటాడు.నామినేషన్స్ కాస్త సీరియస్ గా తీసుకోండి అలాంటి కారణాలు చెప్పకండి అని షణ్ముఖ్ అంటాడు.

అయినప్పటికీ ప్రియాంక మళ్లీ మొదటికి రావడంతో.వెంటనే బిగ్ బాస్ ప్రియాంక మీరు ఎవరిని నామినేట్ చేయకపోతే.

మీరు నేరుగా నామినేట్ అవుతారన్న విషయాన్ని మరిచిపోకండి అంటూ బిగ్ బాస్ ప్రియాంకకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube