ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లానంటున్న వరుణ్ భార్య!  

bigg boss vithika sheru speaks about trolls and negativity, vithika sheru, bigg boss show, netizens, trolls, negitive talk, depression - Telugu Bigg Boss, Bigg Boss Show, Depression, Negitive Talk, Netizens, Trolls, Varun Sandesh Wife, Vithika Reaction About Trolls, Vithika Sheru, Vitika Sheru

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో మంచి ఉంటుందని.చెడు ఉంటుందని.24 గంటల జీవితంలోని క్యాకర్టర్ ను బిగ్ బాస్ గంటలో డిసైడ్ చేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా మరోమారు బిగ్ బాస్ షో గురించి వితిక తన ఆవేదనను వెళ్లగక్కారు.

TeluguStop.com - Bigg Boss Vithika Sheru Speaks About Trolls And Negativity

బిగ్ బాస్ ట్రోల్స్ తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయని ఆమె పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం వితికయూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు.

TeluguStop.com - ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లానంటున్న వరుణ్ భార్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

యూట్యూబ్ లో వీడియోల ద్వారా ఆమె తన మనస్సులోని భావాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తాను గతేడాది ఒక రియాలిటీ షోలో భర్త వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొన్నానని.

అయితే ఆ షోలో తనను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడంతో తనతో పాటు తన కుటుంబం సైతం ఇబ్బందులు పడిందని వితిక తెలిపారు.

తనపై తనకు ఆత్మస్థైర్యం ఉన్న అమ్మాయినని, ధైర్యవంతురాలినని అభిప్రాయం ఉండేదని అయితే షో నుంచి బయటకు వచ్చిన తరువాత ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అన్నారు.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేసేదానినని.అయితే షో నుంచి బయటకు వచ్చాక ఫోటోలు అప్ లోడ్ చేయాలన్నా భయమేసిందని అన్నారు.

బిగ్ బాస్ షో చూసిన తరువాత స్నేహితులు కూడా సపోర్ట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు.
అలాంటి సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచి అన్ని విధాలా సహాయసహకారాలు అందించిందని కుటుంబం అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని ఆమె వెల్లడించారు.

మనిషికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కుటుంబం మాత్రమే తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.అన్ని వ్యాధులతో పోలిస్తే డిప్రెషన్ పెద్ద జబ్బని.

నెటిజన్లు ఇతరులను ట్రోల్ చేసేముందు ఒకసారి ఆలోచించాలని వితిక పేర్కొన్నారు.

#Bigg Boss Show #Vitika Sheru #Negitive Talk #Netizens #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Vithika Sheru Speaks About Trolls And Negativity Related Telugu News,Photos/Pics,Images..