టెన్షన్ టెన్షన్ గా మారిన బిగ్ బాస్ ఓటింగ్ అసలు ట్విస్ట్ ఇదే     2018-07-18   18:46:35  IST  Raghu V

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కకరిది ఒక్కో పంథా.. బాబు గోగినేని మొదట్లో మెరుపులు మెరిపించారు. సమన్యాయం హక్కులు అంటూ బిగ్ బాస్ హౌస్ లోనే కొత్త రూల్స్ పెట్టాడు. ఇక కౌశల్ మీద హౌస్ లో ఆడవారితో సరిగా ప్రవర్తించట్లేదని ఆరోపణలు చేశారు అంతా కలిసి. కానీ అవన్నీ డమ్మీ అని తెలిపోవడమే కాకుండా ప్రేక్షకుల మద్దతు కూడా కౌశల్ కి స్ట్రాంగ్ గా లభించింది. ఇక కిరీటి, భాను లు కౌశల్ తో గొడవ పెట్టుకున్నాక ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ లో భలే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తేజ, తనీష్, దీప్తి సునయన ల ఆట పైన ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తూ ఉంది. గీతా మాధురి మొన్న తేజస్విని అబద్ధం చెప్పింది అని కౌశల్ కి మద్దతు ఇవ్వడంతో ఆమె మీద ఉన్న రెస్పెక్ట్ డబుల్ అయింది. ఇక మొన్న జరిగిన జంటల టాస్క్ లో కౌశల్, సామ్రాట్ లు జంటగా సంకెళ్లు వేసుకుని ఉన్నారు. అయితే ఆ జంట నిర్ణయించుని వారిలో ఎవరో ఒకరు నామినేషన్ కి వెళ్ళాలి. మరి ఈ ఇద్దరు స్నేహితులు హౌస్ లో ఎలా కలిసి ఉంటారో ముందు నుండీ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ సామ్రాట్ కౌశల్ కోసం నామినేషన్ కి వెళ్లి ఇంకో మెట్టు ఎక్కేసాడు ప్రేక్షకుల మదిలో. ఈ సందర్భంగా హౌస్ లో సామ్రాట్ జర్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..!

బిగ్ బాస్ లో 13వ ఆటగాడిగా అడుగుపెట్టిన సామ్రాట్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. బిగ్ బాస్ 2 లో చివరి వరకూ వెళ్తాడు అనిపిస్తోన్న ఆటగాళ్లలో సామ్రాట్ ఒకడు. బిగ్ బాస్ 2 లో మొదటి కెప్టెన్ గా ఎంపికైన సామ్రాట్ అది విజయవంతంగా పూర్తి చేశాడు. పరిస్థితి ఎలాంటిదైనా సంయమనం కోల్పోకుండా ముందుకు వెళుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నిజానికి ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి. నూతన్ నాయుడు అయితే సామ్రాట్ పై అంతెత్తున లేచి పడ్డాడు. అయినా కానీ సామ్రాట్ పరిస్థితి సద్దుమణిగేలా చేయడంలో సఫలమయ్యాడు. టాస్క్ లలో యాక్టివ్ గా పాల్గొవడం, గొడవలకు దూరంగా ఉండటం సామ్రాట్ కు ఉన్న అతి పెద్ద బలాలు.

తేజస్వితో దగ్గరకి మూవ్ అవుతున్నాడు, బిగ్ బాస్ లో ప్రత్యేకంగా ఏర్పడిన ఒక గ్రూప్ లో భాగమయ్యాడు లాంటి కామెంట్లు వినిపించినా అవి ఎక్కువ కాలం నిలబడలేదు. కౌశల్ కోసం నామినేషన్స్ లో నిలబడటానికి ఒప్పుకుని ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నాడు. అయినా కానీ సామ్రాట్ సేఫ్ అవుతాడు అని టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రేక్షకుల నుండి సామ్రాట్ కు అలాంటి సపోర్ట్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

సామ్రాట్ మరి తన గమె ని ప్రేక్షకులని గెలుచుకొవలని సామ్రాట్ కౌశల్ కోసం నామినేషన్ కి వెళ్లి ఇంకో మెట్టు ఎక్కేసాడు ప్రేక్షకుల మదిలో .