నాగార్జునను వింత కోరిక కోరిన హమీదా.. ఆ బహుమతిని పంపాలంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5ను సక్సెస్ చేయడానికి నాగార్జున పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.తెలుగులో బిగ్ బాస్ షో గత సీజన్లు సక్సెస్ సాధించినా ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులను అంతకంతకూ విసుగు పుట్టిస్తోంది.వీక్ డేస్ టైమింగ్ మార్చడం, కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కులు ఆసక్తిగా లేకపోవడం ఇలా వేర్వేరు రీజన్స్ వల్ల బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.

 Bigg Boss Telugu Season 5 Hamida Khatoon Asks Akkineni Nagarjuna Shirt,  Telugu-TeluguStop.com

19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది ఉన్నారు.బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కంటెస్టెంట్లలో హమీదా ఒకరు కాగా హమీదాకు ఈ షోకు రాకముందే పెద్దగా గుర్తింపు రాలేదనే సంగతి తెలిసిందే.హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్లతో క్లోజ్ గా ఉండటం ద్వారా హమీదా వార్తల్లో నిలిచారు.

హౌస్ లో శ్రీరామచంద్రతో హమీదా సన్నిహితంగా ఉండటం గమనార్హం.

Telugu Bigg Boss, Hameeda, Nagarjuna, Reality Show, Telugu Season, Tollywood-Mov

అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జునను హమీదా వింత కోరిక కోరగా నాగార్జున ఆ కోరికను తీరుస్తానని చెప్పారు.స్టైలిష్ గా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చే స్టార్ హీరోలలో నాగార్జున ఒకరు కాగా నాగార్జున తాజా ఎపిసోడ్ లో స్టైలిష్ టీ షర్ట్ లో ఎంట్రీ ఇచ్చారు.నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన తర్వాత హమీదా నాగార్జున టీషర్ట్ నచ్చిందని ఆ టీషర్ట్ తనకు కావాలని కోరడం గమనార్హం.

Telugu Bigg Boss, Hameeda, Nagarjuna, Reality Show, Telugu Season, Tollywood-Mov

నాగార్జున సైతం వెంటనే హమీదాకు ఆ టీషర్ట్ ను ఇవ్వడానికి అంగీకరించారు.అయితే ఆ టీషర్ట్ వేసుకుంటే నువ్వు కనిపిస్తావా? అంటూ నాగార్జున పంచ్ వేయడం గమనార్హం.అయితే నాగార్జున హమీదా కోరికను తీర్చడానికి టీషర్ట్ పంపుతానని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube