అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్ 4 సీజన్!

బిగ్ బాస్ సీజన్ 4.పూర్తయ్యి రెండు వారలు అవుతుంది.

 Bigg Boss Telugu Season 4 Finale Creates Highest Record,bb4 Telugu,bigg Boss Fin-TeluguStop.com

కానీ ఇంకా దాని జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు బిగ్ బాస్ ప్రియులు.కరోనా కాలంలోనూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వచ్చిన ఈ బిగ్ బాస్ సీజన్ 4 అందరిని ఆకట్టుకుంది.

లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి కష్టాలు పడిన అందరికి ఈ షో మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యింది.అంతే ఈ బిగ్ బాస్ సీజన్ 4 కి వచ్చిన వారు అంతా కూడా పాజిటివ్ గానే బయటకు వెళ్లారు తప్ప ఒక్కరు కూడా నెగటివ్ అవ్వలేదు.

ఇక అలాంటి షో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.అలానే డిసెంబర్ 20న పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా హీరో అభిజిత్‌ అవ్వగా.రన్నర్ గా అఖిల్ నిలిచారు.ఇక మూడవ స్థానంలో సోహెల్ నిలిచాడు.మొదటి ఎపిసోడ్ నుంచి ఫినాలే ఎపిసోడ్ వరకు ఎంతో ఉత్కంఠంగా.

అద్భుతమైన టాస్కులతో..

డ్యాన్సులతో షో ను సూపర్ హిట్ చేశారు.ఇక ఈ నేపథ్యంలోనే ఎంత అద్భుతంగా షో చేసారో అంతే అద్భుతంగా షో సక్సెస్ అయ్యింది.

గతంలో ప్రసారం అయినా మూడు బిగ్ బాస్ సీజన్ ల కంటే అధికంగా.కాదు కాదు.ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్స్‌ను మించి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది.ఫినాలే ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేసిన సందడికి ఈ షో ఆ రేంజ్ సూపర్ హిట్ కొట్టింది.

రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ‌ను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా స్టార్‌ మా ప్రకటించింది.ఈ విషయంపైనా స్పందించిన నాగార్జున సైతం తెలుగు ప్రేక్షకులకు ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా నాగార్జున ట్విట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube