నేను మాత్రమే కాదు ఎంతోమంది మీకోసం ఎదురుచూస్తున్నారు.. నటరాజ్ మాస్టర్ పై యాంకర్ రవి!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరిదశకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ లో అలాగే ప్రేక్షకులలో టెన్షన్ మొదలయ్యింది.

 Bigg Boss Telugu Ott Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination ,-TeluguStop.com

ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ ఎవరు నిలుస్తారు.ఎవరు రన్న రప్ గా నిలుస్తారు.

టాప్ ఫైవ్ లో ఎవరెవరు నిలుస్తారు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకోవడానికి కంటెస్టెంట్ లు నువ్వానేనా అన్న విధంగా గట్టిగా పోటీ పడుతున్నారు.

ఇటీవలె 11వ వారం ఎలిమినేన్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఎలిమినేషన్స్ లో బంగా బిగ్ బాస్ హౌస్ నుంచి నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నట్రాజ్ మాస్టర్ తాజాగా యాంకర్ రవి తో బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ లో ముచ్చటించాడు.ఇక వచ్చీరాగానే రాక కోసం ఎదురు చూస్తున్నావా అంటూ యాంకర్ రవి కి కౌంటర్ ఇవ్వగా.

అప్పుడు యాంకర్ రవి తాను ఒక్కడే అనుకుంటే మీ తప్పు అంటూ రీ కౌంటర్ ఇచ్చాడు.ఆ తర్వాత ఒకరి వల్లే తాను బిగ్ బాస్ హౌస్ లో నుంచి మధ్యలోనే బయటకు వచ్చాను అని అనడంతో అప్పుడు రవి ఎందుకు అంత నెగిటివ్ మాస్టర్ అని అంటాడు.

ఆ తరువాత నట్రాజ్ మాస్టర్ తనకు ఒక సక్సెస్ అనేది కూడా రాలేదు అనడంతో టాలెంట్ కి బౌండరీస్ లేవు అని అంటాడు రవి.అప్పుడు నట్రాజ్ మాస్టర్ నువ్వు లోపల ఏదో పెట్టుకుని ఒక పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్ అని అర్థమవుతుంది అంటూ రవి పై ఫైర్ అయ్యాడు నటరాజ్ మాస్టర్.అలా వారిద్దరి మధ్య సంభాషణ కాస్త ఘాటుగానే సాగింది.అయితే ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రవి అడిగిన ప్రశ్నలకు నట్రాజ్ మాస్టర్ కాస్త అసహనానికి లోనయ్యారు అని తెలుస్తోంది.

నట్రాజ్ మాస్టర్ కూడా ఏమాత్రం తగ్గకుండా యాంకర్ రవి గట్టిగానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube