Bigg Boss 6 Srihan : పాపం శ్రీహాన్ అతని కష్టం అంతా వృధా.. టాప్ ఫైవ్ లో కూడా కష్టమే?

బిగ్‌బాస్‌ షోలో ప్రతి సీజన్ లో టికెట్‌ టు ఫినాలే అన్నది చాలా కీలకమైనది.అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్న విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 6 Who Won Ticket Finale Past Seasons Deets Inside , Bigg Boss S-TeluguStop.com

అయితే టికెట్ టు ఫినాలే గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.ఏమిటంటే గతంలో ఇలా టికెట్ టు ఫినాలే గెలిచినవారు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా ఎలిమినేట్ అయ్యారా ఇలాంటి వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.ఆ వివరాల్లోకి వెళితే.బిగ్ బాస్ సీజన్ 3 లో సింగల్ రాహుల్ కి సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న విషయం తెలిసిందే.

టికెట్టు ఫినాలే గెలుచుకున్న మొదటి ఫైనలిస్ట్ గా మాత్రమే కాకుండా ఆ సీజన్ విజేతగా కూడా నిలిచాడు రాహుల్.తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఫినాలే టికెట్‌ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్‌ రికార్డు సృష్టించాడు.

ఆ తరువాత నాలుగో సీజన్‌లో టికెట్‌ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు.ఇక ఐదో సీజన్‌లో శ్రీరామ చంద్ర టికెట్‌ టు ఫినాలే సాధించాడు.

కానీ ఒక టాస్క్‌లో భాగంగా శ్రీరామ్‌ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్‌ లు టాస్క్‌లు పూర్తి చేసి అతడిని గెలిపించారు.కానీ ఆ సీజన్లో సన్నీ విజేతగా నిలవగా షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు.

Telugu Rahul Sipliganj, Shanmukh, Srihan, Sunny, Ticket Finale-Movie

తెలుగులో గడిచిన 5 సీజన్లు గమనిస్తే టికెట్ ఫినాలే గెలిచిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ తప్పితే మిగతా ఎవరూ కూడా విజేతలుగా నిలవలేకపోయారు.రాహుల్ తర్వాత అఖిల్ రన్నరప్ దాకా వచ్చి ఆగిపోయాడు.మరి ప్రస్తుతం తెలుగులో ఒకసారి నవ్వుతున్న సీజన్ 6 లో శ్రీహాన్‌ టికెట్‌ టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.మరి శ్రీహాన్ విన్నర్‌ అవుతాడా? లేక రన్నర్‌ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్‌ చూస్తే రేవంత్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్‌ పెంచుకుని శ్రీహాన్‌ విన్నర్‌ అవుతాడా? కనీసం రన్నరప్‌గా అయినా నిలుస్తాడా? అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube